మూణ్నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా బాహుబలి గురించే చర్చ. ఏ ఇద్దరు కలిసినా బాహుబలే చర్చనీయాంశం అవుతోంది. అందులో పాజిటివ్‌గా మాట్లాడేవాళ్లు ఉండొచ్చు. నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లు ఉండొచ్చు. కానీ చర్చలో మాత్రం బాహుబలి ప్రస్తావన ఉండాల్సిందే. ఈ ఎఫెక్ట్ ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో కానీ.. ఈసారి వినాయక చవితికి విగ్రహాలు తయారు చేసేవాళ్లు సైతం బాహుబలిని విస్మరించలేని పరిస్థితి.
బాహుబలికి సంబంధించి ప్రభాష్ ఫస్ట్ లుక్ గుర్తుంది కదా. శివలింగాన్ని భుజాన పెట్టుకుని నడిచొచ్చే ఆ దృశ్యం సూపర్ పాపులరైంది. ఇప్పడదే రీతిలో వినాయక విగ్రహాలు తయారైపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. వినాయక చవితి వస్తే కొందరు క్రియేటివ్ విగ్రహాలు తయారు చేస్తుంటారు.
ఆ ఏడాది హాట్ టాపిక్‌గా మారిన అంశాల నేపథ్యంలో వినాయక విగ్రహాలు తయారు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈసారికి బాహుబలే హాట్ టాపిక్ కాబట్టి.. బాహుబలి స్టయిల్లో విగ్రహాలు రెడీ అయిపోతున్నాయి. కండల వినాయకుడు.. శివలింగాన్ని మోస్తున్నట్లు విగ్రహాలు తయారు చేస్తున్నారు శిల్పులు. వినాయక చవితి నాటికి ఇలాంటి విగ్రహాలు వేలల్లో దర్శనమిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.