తెలుగు సినిమా ఖ్యాతిని రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటించిన బాహుబలి.. ఇప్పుడు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న ఓ కార్యక్రమంలో భాగం కానుంది. మేకిన్ ఇండియా.. ఇప్పుడిదో జపం. మోడీ సారధ్యంలో కేంద్రం చేస్తున్న ఓ యజ్ఞం అనాల్సిందే. ఎందుకంటే.. దేశానికి దశదిశ మార్చే పవర్ ఈ కార్యక్రమానికి ఉందని కేంద్రం నమ్ముతోంది. అలాంటి మేకిన్ ఇండియాలో ఇప్పుడు బాహుబలి ది బిగినింగ్ కూడా ఓ భాగం అవుతోంది.
ఈ సినిమా గురించి మేకిన్ ఇండియా సదస్సులో ఓ స్పెషల్ సెషన్ ఉండనుందంటే.. జక్కన్న తీసిన ఈ చిత్రరాజం ఏ స్థాయిలో ఖ్యాతి సంపాదించిందో అర్ధమవుతుంది. ఇదేమీ కల్లబొల్లి కబుర్లు కావు, బాహుబలిని ఆకాశానికి ఎత్తేసేందుకు కూడా కాదు. 'మేకిన్ ఇండియాలో భాగంగా ఐడీఎఫ్ 2016లో బాహుబలి మూవీ మేకింగ్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ముంబై వెళుతున్నా' అంటూ శోభ యార్లగడ్డ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్ చాలు.. బాహుబలి సాధించిన ఘనత అర్ధం అయేందుకు.
తెలుగులో కానీ, ఇండియాలో కానీ ఈ రేంజ్ సినిమా వస్తుందని, తీయగలరని అంచనాలు కూడా లేని సమయంలో.. బాహుబలి వచ్చి రికార్డుల దుమ్ము దులిపేసింది. మరికొన్ని రోజుల్లో చైనాలో 6వేల ప్రింట్లతో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏ స్థాయి సంచలనానలు సృష్టిస్తోందో అర్ధం చేసుకోవచ్చు.