ప్రభాస్‌ ఓపెన్‌ బుక్‌ లాంటోడమ్మా!!

Update: 2015-04-11 07:30 GMT
ప్రభాస్‌ బహు సిగ్గరి. నాతో మాట్లాడడానికే మూడు రోజుల టైమ్‌ పట్టింది. మరీ ఇంత సిగ్గేంటి? అనుకున్నా. అతడితో తొలిసారి పరిచయం అయ్యాక తెలిసింది. అతడు ఓవెన్‌ లాంటోడు. వేడిమీదుంటాడు. ఓపెన్‌ బుక్‌ లాంటోడు. ఏదీ మనసులో దాచుకోడు. ఎవరితోనైనా కలవాలంటే బాగా మొహమాటపడతాడు.. అంటూ ఓపెన్‌గా చెప్పేస్తోంది ఐటెమ్‌భామ స్కార్లెట్‌ విల్సన్‌. అసలింతకీ ప్రభాస్‌కి ఈవిడెక్కడ తగిలింది? అనేగా మీ సందేహం. అవును ఈ భామ ప్రస్తుతం బాహుబలి చిత్రంలో ఓ ఐటెమ్‌ నంబర్‌లో నర్తిస్తోంది. ఒంపుసొంపుల వడ్డనల్ని ప్రభాస్‌ అభిమానుల కోసం వండి వార్చుతోంది. వేరే ఐటెమ్‌ బాంబ్‌లు నోరా పతేేహి, స్నేహ ఉపాధ్యాయ్‌లతో కలిసి ఈ అమ్మడు స్టెప్పులేసింది. ఈ ఒక్క పాటతోనే, ఉన్న కొద్దిపాటి పరిచయంతోనే ప్రభాస్‌ని సాంతం చదివేశానని చెబుతోంది అమ్మడు. ప్రభాస్‌ చాలా ఒద్దికగా ఉండే కుర్రాడు. అసలు నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత మొహమాటస్తుడు అని చెబుతూ తెగ సిగ్గుపడిపోయింది. అంతేనా ? అతడికి ఆడవాళ్లంటే ఎంత గౌరవమో? తిన్నారా? తాగారా? లాంటి ప్రశ్నలు వేసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండని చెబుతాడు. సెట్‌లో మాట్లాడనట్టే కనిపించినా అందరినీ పట్టించుకుంటాడు అని చెప్పింది స్కార్లెట్‌. బాప్‌రే ఎంత బాగా చదివేసింది?

Tags:    

Similar News