జూలై 10.. ఇంకా చాలా రోజులే ఉంది. ఓ రెండు వారాలు రమారమీ అనుకోండి. అ రోజు టాలీవుడ్‌కు ఎంతో ముఖ్యమైన పండుగ. తల్లితండ్రులు అందరూ జాయింట్‌గా డెసిషన్ తీసుకొని స్కూళ్ళకు హాలీడే అడిగినా అడగొచ్చు. ఎందుకంటే ఆ రోజు బాహుబలి మూవీ విడుదలవుతోంది. 250 కోట్ల బడ్జెట్, అతి పెద్ద స్టార్ క్యాస్ట్, నాలుగు బాషల్లో రిలీజ్.. కట్ చేస్తే... సినిమా ఎన్ని ధియేటర్స్‌లో విడుదలవుతోంది?
ఆల్రెడీ 4000 ధియేటర్స్ షుమారులో సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ప్రతీ ఊరిలోనూ ధియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ బాహుబలి మాకు కావాలంటే మాకు కావాలి అని కొట్టుకుంటున్నారు. అసలు రిలీజ్ చేద్దాం అనుకున్న ధియేటర్స్‌కంటే ఇప్పుడు సినిమా ఇంకా ఎక్కువ ధియేటర్స్‌లో రిలీజ్ అయ్యేలా ఉంది. దాదాపు ఓ 70% సెంటర్స్‌లో ఊళ్ళోని అన్ని ధియేటర్స్‌లో బాహుబలి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నిర్మాతలకు అంత ఆశ లేకపోయినా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సినిమాపై వెర్రెత్తి ఉన్నారని టాక్. ఆ లెక్కన చూస్తే.. ఓ వారంపాటు మిగిలిన సినిమాలన్నింటికీ వాష్ అవుట్ తప్పదు. ఓ వారం తరువాత మెయిన్ ధియేటర్‌కు బాహుబలి వెళిపోతే, మిగిలిన ధియేటర్స్‌లో మిగిలిన సినిమాలు సందడి చేస్కోవచ్చు. అది సంగతి.