పీసీకి ట‌చ్ లో లేని ఆ ఒక్క‌డు ఎవ‌ర‌బ్బా?

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ దంప‌తులు ధాంప‌త్య జీవితంలో ఎంత సంతోషంగా ఉంటు న్నారో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2025-03-01 09:30 GMT

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ దంప‌తులు ధాంప‌త్య జీవితంలో ఎంత సంతోషంగా ఉంటు న్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. పీసీ వివాహం అనంత‌రం న్యూయార్క్ లో కాపురం పెట్టినా? ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ అందిస్తూ భార‌తీయుల‌కు నిత్యం ట‌చ్ లో ఉంటుంది. అలా భార‌తీయ అభిమానుల‌తో పీసీ అనుబంధం విడ‌దీయ‌రానిది. అయితే పీసీ కూడా ఎఫైర్ల విష‌యంలో పెళ్లికి ముందు త‌క్కువేం కాద‌ని చాలా సంద‌ర్భాల్లో తానే స్వ‌యంగా వెల్ల‌డించింది.

నిక్ జోనాస్ త‌న జీవితంలోకి రాక‌ముందు చాలా మందితో డేటింగ్ చేసిన‌ట్లు ప‌బ్లిక్ గానే చెప్పింది. `ఒకరితో బ్రేకప్ కాగానే.. మరొకరిని ప్రేమించేదాన్ని. ఒక బంధానికి.. మరొక బంధానికి మధ్య పెద్ద గ్యాప్ కూడా ఇవ్వలేదు. నటిగా ఎంతో బిజీగా ఉండేదాన్ని. నాతో పని చేసిన చాలామందితో డేటింగ్ చేశాను. అందులో కొన్ని విషాదంగా ముగిసాయి. కానీ నేను డేటింగ్ చేసినవారందరూ అద్భుతమైనవారు.

చివరి బ్రేకప్ తర్వాత మరో బంధంలో అడుగుపెట్టడానికి చాలా టైం తీసుకున్నాను. ఎందుకుంటే, నా ప్రేమలన్నీ విఫలమయ్యాయి. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ తర్వాత నిక్ కలిశాడు. అతడు నా ప్రియుడిగానే కాక భర్తగానూ ప్రమోషన్ తీసుకున్నాడు. తను కూడా నాకంటే ముందు చాలా మందిని ప్రేమించాడు. కానీ.. అతడి గతం కన్నా తనతో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యమనుకున్నానని` ఓ సంద‌ర్భంలో మీడియా ముఖంగా వెల్ల‌డించింది.

దీంతో నిక్-పీసీ ఎంతో ఓపెన్ గా ఉంటున్నారన్న‌ది అద్దం ప‌ట్టింది. తాజాగా పీసీ గురించి ఆమె త‌ల్లి మ‌ధు చోప్రా మరో ఆస‌క్తిర విష‌యం పంచుకున్నారు. కుమార్తె గ‌త రిలేష‌న్ షిప్ గురించి మాట్లాడారు. ప్రియాంక ఒక‌రితో త‌ప్ప త‌న మాజీలంద‌రితో మంచి స‌త్సంబంధాల‌ను క‌లిగి ఉంది. ఆమె ఎవరినైనా ఇష్టపడకపోతే ఆమె వారితో పూర్తిగా సంబంధాలను తెంచుకుంటుంది. అది త జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగింది. ఎందుకంటే ఆ సంబంధం పీసీని అంత‌గా కోలోకోకుండా చేసింది. గతంలో ప్రియాంకతో డేటింగ్ చేసిన కొంతమంది వ్యక్తులను నేను కూడా ఆమోదించ‌లేదు. నా ఇష్టం లేకుండానే కొన్ని ప‌నులు చేసింద‌ని` మ‌ధు చోప్పా తెలిపారు.

Tags:    

Similar News