హైదరబాద్ టూ తిరుమల బండ్ల గణేష్ పాదయాత్ర!
బ్లాక్ బస్టర్ గణేష్ గా ఫేమస్ అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
బ్లాక్ బస్టర్ గణేష్ గా ఫేమస్ అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొంత కాలంగా సినిమాలకు..రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం మీడియా ఇంటర్వ్యూలతోనే హైలైట్ అవుతున్నాడు. సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు గానీ పనవ్వడం లేదు. స్టార్ హీరోలంతా ఇతర దర్శక, నిర్మాతలతో కమిట్ అవ్వడంతో గణేష్ కి డేట్లు ఇవ్వలేకపోతున్నారు.
అయినా ప్రయత్నం వదలకుండా తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. మరి నిర్మాతగా ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి. అయితే ఆయన ఇప్పుడు నిర్మాతగా ట్రై చేయడం కంటే నటుడిగా ప్రయత్నిస్తే ఆయనకు ఎవరో ఒకరు అవకాశం ఇస్తారు అన్నది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న మాట. గతంలో ఆయన వివిధ అంశాలపై చేసిన వ్యాఖ్యలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయింది.
దాని ఆధారంగా దర్శక, నిర్మాతలు నటుడిగా అవకాశం ఇస్తారని కొంత మంది భావిస్తున్నారు. గతంలో చాలా సినిమాల్లో నటించి రిటైర్మెంట్ ఇచ్చాడు. మధ్యలో రాజకీయాలు కూడా చేసాడు. కానీ సినిమాల్లో సక్సెస్ అయినంతగా రాజకీయాల్ల సక్సస్ అవ్వలేదు. రకరకాల పార్టీలు మారడం కూడా గణేష్ స్థిరత్వాన్ని సూచించింది. అయితే తాజాగా గణేష్ తిరుమలకు పాదయాత్ర చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
హైదరాబాద్ షాద్ నగర్ లోని ఆయన నివాసం నుంచి తిరుమల కొండపైకి పాదయాత్ర చేసి వెంకటే శ్వరస్వామి మొక్కు చెల్లించే ఆలోచన లో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్టార్ హీరోతో సినిమా నిర్మిస్తాడని..అలాగే రాజకీయాల్లో కూడా ఆయనకు పదవి ఏదో దక్కబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ రెండు అనుకున్నట్లు సిద్దించాలని గణేష్ తిరుమల పాదయాత్రకు పూనుకు న్నట్లు వార్తలొస్తున్నాయి.