లంచ్ బాక్సులో డ్రగ్స్ దందా వర్కౌట్ అవుతుందా!
తొలుత ఈ వెబ్ సిరీస్ పై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ప్రచార చిత్రాలు ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించలేదు.
నెట్ ప్లిక్స్ అందిస్తోన్న కంటెంట్ కి మంచి రేటింగ్స్ వస్తోన్నసంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ లను నిర్మిస్తూ ప్రేక్షకులకు కొత్తఅనుభూతిని పంచుతుంది. ఈ క్రమంలో తాజాగా నెట్ ప్లిక్స్ కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. హితేష్ బాటియా దర్శకత్వంలో తెరకెక్కిన 'డబ్బా కార్టెల్' ఫిబ్రవరి 28న రిలీజ్ అయింది. తొలుత ఈ వెబ్ సిరీస్ పై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ప్రచార చిత్రాలు ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించలేదు.
దీంతో ఈ కాన్సెప్ట్ ఎక్కడం కష్టమనే కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడా నెగిటివిటీ అంతా పాజిటివ్ గా మారిపోతుంది. వెబ్ సిరిస్ కి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇండియన్స్ ఈ వెబ్ సిరీస్ ని బ్రేకింగ్ బాడ్ అంటూ పిలుస్తున్నారు. నటీనటుల పెర్పార్మెన్స్ ను ప్రశంసిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఓసారి డబ్బా కార్టెల్ స్టోరీలోకి వెళ్తే... వివిధ రంగాలకు చెందిన అమాయకంగా కనిపించే మధ్యతరగతి మహిళలు డబ్బా సేవ( ముంబైలో ప్రసిద్ద టిఫిన్ సేవ) వ్యాపారం ప్రారంభిస్తారు.
ఓ సాధారణ టిపిన్ సర్వీస్ సెంటర్ నడిపించే మహిళలు డ్రగ్స్ అక్రమ రవాణాలో చిక్కుకోవడం, వీరితో పాటు ఓ పార్మాకంపెనీలో పనిచేసే ఉద్యోగులున్నారని తెలియడం సిరీస్ కి హైప్ తీసుకొచ్చింది. సాధారణ మహిళలు చేసే డ్రగ్స్ వ్యాపారం కారణంగా వారు కుటుంబాలు ఎదుర్కున్న సమస్యలు ఏంటి? ఈ పోరాటంలో వాళ్లెంత దూరం వెళ్లారు? అన్నది ఆసక్తికరంగా మలిచారు.
ఇందులో షబనా అజ్మీ లీడ్ రోల్ పోషించారు. జ్యోతిక, షాలిని పాండే కీలకపాత్రలు పోషించారు. సిరీస్లో ప్రతీ పాత్ర అద్భుతంగా పండిందంటూ నెటి జనులు ప్రశంసిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సిరీస్ కి మంచి రీచ్ దొరుకతుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ ని పర్హాన్ అక్తర్- రితేష్ సిద్వానీ ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మించారు.