డాకు మహారాజ్ కలెక్షన్స్ తగ్గడానికి కారణమదే: నాగవంశీ
సినిమాలో బాలయ్య మాస్ యాక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజయ్ కార్తీక్ విజువల్స్ కు మంచి ప్రశంసలొస్తున్నాయి.;
నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో వచ్చి డాకు మహారాజ్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో దూసుకెళ్తుంది. సినిమాలోని వివిధ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో డాకు మహారాజ్ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తోంది. సినిమాలో బాలయ్య మాస్ యాక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజయ్ కార్తీక్ విజువల్స్ కు మంచి ప్రశంసలొస్తున్నాయి.
ఇవన్నీ పక్కనపెడితే డాకు మహారాజ్ కొన్ని చోట్ల సరిగా పెర్ఫార్మ్ చేయలేకపోగా మరికొన్ని ఏరియాల్లో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. దీని గురించి డాకు మహారాజ్ నిర్మాత నాగవంశీ మ్యాడ్ స్వ్కేర్ ప్రమోషన్స్ లో దానికి గల కారణాన్ని వెల్లడించాడు. అదే సీజన్ లో వెంకటేష్ నుంచి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల తమ సినిమాకు కలెక్షన్స్ తగ్గాయని నాగవంశీ వెల్లడించాడు.
వెంకటేష్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం, అది ఫ్యామిలీ జానర్ సినిమా కావడంతో డాకు మహారాజ్ కు కలెక్షన్స్ తగ్గాయని, ఈ సినిమాకు థియేటర్లలో తాము అనుకున్నంత రెవిన్యూ రాలేదని తెలిపాడు వంశీ. అయితే డాకు మహారాజ్ బాలయ్య స్ట్రాంగ్ ఏరియాల్లో బాగానే పెర్ఫార్మ్ చేసిందని, కానీ వేరే సినిమా ఎఫెక్ట్ వల్ల తమ సినిమాకు అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాకపోవడం తమను డిజప్పాయింట్ చేసిందని వంశీ అన్నాడు.
తమ సినిమాకు అనుకున్న స్థాయి కలెక్షన్స్ రాకపోయినా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వెంకటేష్, దిల్ రాజు కి అంత పెద్ద హిట్ దక్కడం, ఆ సినిమా అంత పెద్ద మొత్తంలో కలెక్ట చేయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని నాగవంశీ చెప్పాడు. డాకు మహారాజ్‌కే కాదు, తనకు గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనట్టు వంశీ తెలిపాడు.
తమ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుందని, వాస్తవానికి లక్కీ భాస్కర్ మూవీ చేసేటప్పుడే దాన్ని మల్టీప్లెక్స్ మూవీ అనుకున్నామని, కానీ అదే టైమ్ లో అమరన్ సినిమా రావడం, అది కూడా మల్టీప్లెక్స్ సినిమానే కావడంతో అమరన్ వల్ల లక్కీ భాస్కర్ కు కూడా కలెక్షన్లు తగ్గాయని నాగవంశీ అన్నాడు. ఇక మ్యాడ్ స్క్వేర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో కూడా మ్యాడ్ మూవీలానే కథేమీ ఉండదని, కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుందని నాగవంశీ వెల్లడించాడు.