వారసుడు కోసం ఆ ముగ్గుర్నీ దించుతున్నారా?
'రౌడీ బోయ్స్' తో ఫేమస్ అయిన దిల్ రాజు తమ్ముడు కుమారుడు అశిష్ రెడ్డి అటుపై వివాహం చేసుకోవడంతో పాటు ఓ రెండు సినిమాలు పట్టాలు కూడా ఎక్కించిన సంగతి తెలిసిందే.;
'రౌడీ బోయ్స్' తో ఫేమస్ అయిన దిల్ రాజు తమ్ముడు కుమారుడు అశిష్ రెడ్డి అటుపై వివాహం చేసుకోవడంతో పాటు ఓ రెండు సినిమాలు పట్టాలు కూడా ఎక్కించిన సంగతి తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా అశిష్ హీరోగా 'సెల్ఫిష్' అనే సినిమా మొదలైంది. ఇందులో ఇవానా హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ కూడా పూర్తయినట్లు వార్తలొచ్చాయి. ఇది అశిష్ రెండవ సినిమాగా ప్రేక్షకుల ముందు కు రానుందని అంతా భావిస్తున్నారు.
ఇక మూడవ చిత్రాన్ని హారర్ లవ్ ఎంటర్‌టైనర్‌గా అరుణ్ అనే డైరెక్టర్ తో పట్టాలెక్కించారు. ఈ సినిమా కు ఆస్కార్ విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తోండగా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా బాధ్యతల్ని తీసుకున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లోనే సినిమా నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ రెండు సినిమాల గురించి మళ్లీ ఎలాంటి అప్డేట్ రాలేదు. గత ఏడాది కంటే ముందే మొదలైన ప్రాజెక్ట్ లివి. మరి ఇవి ఇంకా సెన్స్ లో ఉన్నాయా? ఆగిపోయాయా? అన్నది క్లారిటీ రావాలి.
ఈ నేపథ్యంలో అశిష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఫిలిం నగర్ లో చక్కెర్లు కొడుతుంది. వారసుడు కోసం అశిష్ తండ్రి ముగ్గురు దర్శకుల్నిలైన్ లో పెడుతున్నారట. త్రినాధరావు నక్కిన,'బొమ్మరిల్లు' భాస్కర్, కరుణాకర్ లతో సదరు నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. ఇటీవల రిలీజ్ అయిన 'మజాకా'తో త్రినాధరావు పాజిటివ్ వైబ్ తెచ్చుకున్నాడు. అతడి గత సినిమాలు కమర్శియల్ గా వర్కౌట్ అయినవే.
ఇక దిల్ రాజు బ్యానర్ కి బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన చరిత్ర భాస్కర్ ది. ఇటీవల రీ-రిలీజ్ అయిన అతడి గత చిత్రం 'ఆరేంజ్' కూడా బాగా ఆడుతుంది. రీ-రిలీజ్లో సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక కరుణా కరన్ క్లాసిక్ హిట్ల గురించి దిల్ రాజుకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో అశిష్ తదుపరి చిత్రాల లైనప్ ఈ ముగ్గురితో దిల్ రాజ్ అండ్ కో ప్లాన్ చేస్తుందట.