పిక్‌టాక్ : చీర కట్టిన సుందరి నడుము అందం..!
హీరోయిన్స్‌లో మల్టీ ట్యాలెంటెడ్ ముద్దుగుమ్మలు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఆండ్రియా జెరెమియా ఒకరు అనడంలో సందేహం లేదు.
హీరోయిన్స్‌లో మల్టీ ట్యాలెంటెడ్ ముద్దుగుమ్మలు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఆండ్రియా జెరెమియా ఒకరు అనడంలో సందేహం లేదు. హరిష్ జయరాస్ సంగీతం అందించిన అన్నియన్ సినిమాలో కన్నుమ్ కన్నుమ్ నోకియా పాటతో ఆండ్రియా సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి పాటతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఎన్నో పాటలు పాడి అలరించింది. స్టేజ్ షోల్లోనూ తెగ సందడి చేసింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బ్రేకప్ అంటూ ప్రచారం జరిగింది. కెరీర్ ఆరంభం నుంచి ఈ అమ్మడు సినిమాలతోనే కాకుండా ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉంది.
ఆండ్రియా తమిళనాడులోని ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి మద్రాస్ హైకోర్ట్‌లో న్యాయవాదిగా చేస్తూ ఉండేవారు. చెన్నైలోని సెయింట్ జోసెఫ్స్ సెకండరీ స్కూల్లో, ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్‌లో చదువు కొనసాగించింది. ఆండ్రియా 8 ఏళ్ల వయసులోనే పియానో వాయించడం నేర్చుకుంది. 10 ఏళ్ల వయసులో యంగ్ స్టార్స్ అనే ఈవెంట్ బృందంలో భాగం అయింది. అందులో ఆండ్రియా పాటలు పాడుతూ ఉండేది. అలా థియేటర్ ఆర్టిస్ట్‌గా పలు నాటకాల్లోనూ కనిపించింది. కాలేజ్ రోజుల నుంచే ఆమెకు నటనపై సింగింగ్ పై ఆసక్తి పెరగడంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.
తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఈమె నటించిన తమిళ సినిమాలు డబ్ అయ్యి తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మొత్తానికి ఆండ్రియా హీరోయిన్‌గా బిజీ బిజీగా ఉంది. సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ఆరబోత పోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందమైన చీర కట్టు ఫోటోను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈసారి నడుము అందం చూపిస్తూ ఆండ్రియా ఇచ్చిన ఫోటో ఫోజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చీర కట్టులో ముద్దుగుమ్మ ఆండ్రియా చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ కామెంట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా ఆండ్రియా ఎక్కువగా మోడ్రన్ డ్రెస్‌ల్లో కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఎక్కువగా మోడ్రన్ డ్రెస్‌ల్లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు చీర కట్టులో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. చీర కట్టులో నడుము అందం చూపిస్తున్న ఆండ్రియా సరికొత్తగా కనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. ఇక ఈ అమ్మడు ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. తమిళ్‌లో నాలుగు సినిమాలు చేస్తుంది. ఆ నాలుగు సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో కనీసం మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆండ్రియా రెడీ అవుతోంది.