ప్రేమలు హీరోయిన్‌ది మామూలు లక్ కాదు!
ప్రేమలు సినిమాతో ఆడియన్స్ దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది మమితా బైజు. లవ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో మమిత ఇన్నోసెన్స్, అల్లరితనం, నేచురల్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది.;
ప్రేమలు సినిమాతో ఆడియన్స్ దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది మమితా బైజు. లవ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో మమిత ఇన్నోసెన్స్, అల్లరితనం, నేచురల్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. మొదటి సినిమానే హిట్ అవడంతో మమితాకు అవకాశాలు వరుసపెట్టి వస్తున్నాయి. ప్రేమలు మూవీ మలయాళ, తెలుగు, తమిళ సినిమాల్లో రిలీజవడం వల్ల అమ్మడుకి అన్ని భాషల నుంచి ఛాన్సులొస్తున్నాయి.
మమిత ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సరసన రెబల్ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన మమిత రెండో సినిమాకే స్టార్ హీరో విజయ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమాలో మమిత చాలా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే మమిత లక్ ఇక్కడితో ఆగిపోలేదు. తాజాగా అమ్మడు మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. హీరోగా, దర్శకుడిగా సక్సెస్‌లతో దూసుకెళ్తున్న ప్రదీప్ రంగనాథన్ సినిమాలో మమిత ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. సుధా కొంగర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన కీర్తీశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు సమాచారం.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుండగా, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ పక్కన హీరోయన్ గా నటించడమంటే అమ్మడు మంచి అవకాశం దక్కించుకున్నట్టే. అది కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో. సౌత్ లో వరుస సక్సెస్‌లతో తమ బ్యానర్ స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న మైత్రీ సంస్థలో మమితా ఛాన్స్ దక్కించుకోవడం కూడా అదృష్టమనే చెప్పాలి. సినిమా హిట్ అయితే మమిత క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం.