సంక్రాంతికి వస్తున్నాం.. RRR ను కూడా కొట్టేసిందిగా..
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లు సాధించింది.;
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లు సాధించింది. కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అఖండ విజయాన్ని అందుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మళ్లీ ఒకసారి తన స్టైల్ ఎంటర్టైన్మెంట్‌తో ప్రేక్షకులను అలరించాడు.
అయితే సినిమా విజయయాత్ర ఇదితో ఆగిపోలేదు. ఇప్పుడు ఓటీటీలో మరోసారి రికార్డులు బద్దలు కొడుతోంది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ZEE5లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్లలో ఓ రేంజ్‌లో దూసుకెళ్లిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే జోరు కొనసాగిస్తోంది. విడుదలైన 12 గంటల్లోనే సినిమా 1.3 మిలియన్ వ్యూయర్లను దక్కించుకుని సంచలనం సృష్టించింది. అంతేకాదు, మొత్తం 100 మిలియన్ ప్లస్ వీయింగ్ నిమిషాలతో అద్భుతమైన రికార్డు సాధించింది.
ఇదే సమయంలో ఇప్పటికే పలు రికార్డులు సాధించిన RRR - హనుమాన్ వంటి చిత్రాల రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. ఓటీటీలో విడుదలైన మొదటి రోజునే అత్యధిక వ్యూయింగ్ నిమిషాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. సినిమాకు వచ్చిన ఈ భారీ రెస్పాన్స్ చూస్తుంటే, కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సున్నితమైన కామెడీ, భావోద్వేగ సన్నివేశాలు, వెంకటేష్ కామెడీ టైమింగ్ ఇవన్నీ కలిసి సినిమాను ఓ అద్భుతమైన ఎంటర్టైనర్‌గా నిలబెట్టాయి.
థియేటర్లలో చూసే అవకాశం మిస్సయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలైన 12 గంటల్లోనే ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ రావడం, ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఉన్న మక్కువను రుజువు చేస్తోంది. ఇక జీ5లో స్ట్రీమింగ్ మొదలైన సంక్రాంతికి వస్తున్నాం మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది. గతంలో థియేటర్లలో చూసిన వారు మళ్లీ రివాచ్ చేస్తున్నారు. ఓటీటీ ఆడియెన్స్ నుంచి కూడా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
సోషల్ మీడియాలో సినిమాపై ఎన్నో పాజిటివ్ రివ్యూలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వెంకటేష్ పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, కామెడీ ట్రాక్, సెంటిమెంట్ సన్నివేశాలు అన్నీ కలిసొచ్చి ఈ సినిమాను ఓటీటీ హిట్‌గా నిలబెట్టాయి. అంతేకాదు, ZEE5లో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ డే వ్యూయింగ్ నెంబర్స్‌ను సాధించింది. ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన తర్వాత, ఇకపై కూడా సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ప్రపంచాన్ని షేక్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ZEE5లో టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఇది నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.