అబ్బాయ్ కోసం బాబాయ్ పవన్ ప్రయత్నాలా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్సీ 16 షూటింగ్ బుచ్చిబాబు దర్శకత్వంలో శర వేగంగా జరుగు తోన్న సంగతి తెలిసిందే.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్సీ 16 షూటింగ్ బుచ్చిబాబు దర్శకత్వంలో శర వేగంగా జరుగు తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకుని ఢిల్లీ షెడ్యూల్ కు రెడీ అవు తోంది. రామ్ చరణ్ సహా ప్రధాన పాత్ర ధారులపై కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించనున్నారు. అయితే ఢిల్లీ లో షూటింగ్ ప్లాన్ చేయడంతో కుస్తీ పోటీకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారని ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం అది కాదని తెలుస్తోంది.
పార్లమెంట్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉందిట. దీనిలో భాగంగానే ఢిల్లీ వె ళ్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే పార్లమెంట్ లో షూటింగ్ అనుమతులు అంత వీజీ కాదు. గతంలో షూటింగ్ సినిమా షూటింగ్ అనే సరికి పెద్దగా ప్రొసిజర్ లేకుండా అనుమతులు ఈజీగా వచ్చేవి. ఇప్పుడు అలా రావడం లేదు. చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆర్సీ 16 టీమ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాతో సులువుగా అనుమతులు సంపాదించే పనిలో పడ్డట్లు సమాచారం.
పవన్ కళ్యాన్ ఏపీ డిప్యూటీ సీఎం అయినా? కూటమి పేరుతో ఢిల్లీలో చక్రం తిప్పగల నాయకుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వ పెద్దలతో మంచి పరిచయాలు, సాన్నిహిత్యం ఉంది. కాబట్టి అబ్బాయ్ సినిమా షూటింగ్ కోసం అనుమతులు పవన్ తలుచుకుంటే చాలు పనైపోతుంది. అలాగే జామా మసీదులో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందిట. దీనికి సంబంధించి రంజాన్ తర్వాత అనుమతులు వచ్చే అవకాశం ఉంది.
ఈ లోగా పార్లమెంట్ లో అనుమతులు వస్తే ముందుగా అక్కడ షూట్ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే క్యాన్సర్ చికిత్స నుంచి శివ రాజ్ కుమార్ కోలుకుంటున్నారు. ఈవారంలో ఆయన కూడా షూట్ లో జాయిన్ అవుతారని సమాచారం. ఇప్పటికే శివ రాజ్ కుమార్ పై కొంత షూటింగ్ పూర్తయింది. మరికొన్ని రోజులు పాల్గొంటే ఆయన పోర్షన్ పూర్తవుతుందని సమాచారం.