'ఛావా' తెలుగు ట్రైలర్: గూస్‌బంప్స్ పక్కా!
చత్రపతి శంభాజీ మహారాజ్ వీరత్వాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఛావా సినిమా హిందీలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.;
చత్రపతి శంభాజీ మహారాజ్ వీరత్వాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఛావా సినిమా హిందీలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలో నటించిన ఈ చిత్రం, విడుదలైనప్పటి నుండి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి హిందీలో అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటికే బాక్సాఫీస్ లెక్క రూ.500 కోట్లను దాటడం విశేషం.
దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ రావడంతో పాటు రీజినల్ లాంగ్వేజ్ లలో కూడా సినిమాను విడుదల చేయాలని సినిమాపై యూనిట్ పై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా శివాజీ మహరాజ్ కు అభిమానులు ఉన్నారు. ఇక ఆయన వారసుడి జీవితాన్ని వెండితెరపై చూడాలని బలంగా కోరుకున్నారు. ఇక వారి కోరిక మేరకు ఇప్పుడు ప్రముఖ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చావా సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా, ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
తెలుగు ట్రైలర్ చూస్తే, సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతాయి. ముఖ్యంగా చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ, ఆయన వీరోచిత పోరాటాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్‌గా నటించిన తీరును చూస్తుంటే నిజంగానే అప్పుడు మన ముందున్న మహారాజ్ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇక రష్మిక మందన్నా శంభాజీ సతీమణి యేసుభాయి పాత్రలో కనిపించి మరోమారు తన మినరల్ పెర్ఫార్మెన్స్‌ను చూపించారు. ఇక ‘ఔరంగజేబ్’ పాత్రలో అక్షయ్ ఖన్నా కనిపించిన విధానం ఈ సినిమాలో మరో హైలెట్. ఈ ట్రైలర్‌లో చూపించిన యుద్ధ దృశ్యాలు, రాజకీయ మర్మాలు, కుటుంబ బంధాలు, వీరత్వం..వంటి అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. శంభాజీ కథను తెలుగులో చూడాలి అని ఎదురుచూస్తున్న జనాలకు ఇప్పుడు ఈ ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది.
ఇక సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సాంగ్స్ ను కూడా తెలుగులో అద్భుతంగా ప్రజెంట్ చేసినట్లు అనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఈ విజువల్స్‌ను ఇంకాస్త ఎలివేట్ చేసింది. ముఖ్యంగా కొన్ని డైలాగులు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా అద్భుతంగా పేలింది. సాధారణంగా ఇలాంటి పీరియాడిక్ మూవీస్‌కి డబ్బింగ్ సహజంగా ఉండకపోతే, ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ‘ఛావా’కి మాత్రం సరిగ్గా కుదిరిన డైలాగ్ డెలివరీ, ప్రాస యధాతథంగా ఉండటంతో సినిమా నేటివిటీ కోల్పోకుండా, సహజత్వాన్ని నింపింది.
తెలుగు ప్రేక్షకులు ఇలాంటి చారిత్రాత్మక కథలను ఎంతో ఇష్టపడతారు. ‘ఛావా’ కూడా అదే తరహాలో అద్భుతమైన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. చత్రపతి శంభాజీ మహారాజ్ గురించి తెలియని వారికీ, ఆయన పోరాట వైభవాన్ని గురించి వివరించే ఒక అద్భుతమైన కాంటెంట్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని మార్చి 7న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.