70 కోట్లతో నేషనల్ క్రష్ తో లేడీ ఓరియేంటెడ్!
రష్మికా మందన్నా నేడు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోయిన్. నేషనల్ క్రష్ గా నీరాజనాలు అందుకుంటుంది.
రష్మికా మందన్నా నేడు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోయిన్. నేషనల్ క్రష్ గా నీరాజనాలు అందుకుంటుంది. 'యానిమల్', 'పుష్ప' లాంటి విజయాలు ఆమె స్థాయిని ఒక్కసారిగా మార్చడంతోనే ఇది సాధ్యమైంది. బాలీవుడ్ లో స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటుంది. వందల కోట్ల ప్రాజెక్ట్ ల్లో భాగమవుతుంది. త్వరలో సల్మాన్ ఖాన్ తో నటించిన 'సికిందర్' సినిమాతో అలరించడానికి రెడీ అవుతుంది.
స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అంతా రష్మికతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలో తాను ఉంటే? అదే సినిమాకు అమ్మడు అదనపు అస్సెట్ గా మారుతుంది. దీంతో నిర్మాత లంతా వ్యాపార కోణంలో రష్మికకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక పెర్పార్మెన్స్ పరంగా చెప్పాల్సిన పనిలేదు. మేకర్స్ అమ్మడి డేట్లు కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రష్మిక క్రేజ్ ని గురించి ఓ బడా నిర్మాణ సంస్థ పాన్ ఇండియాలో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు లీకులందుతున్నాయి.
రష్మిక తో ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేయాలని పావులు కదుపుతోందట. 70-100 కోట్ల బడ్జెట్ లో సినిమా చేస్తే మంచి లాభాలు వస్తాయని భావిస్తోందట. తెలుగు, హిందీ, తమిళ్ లో ఆమె మార్కెట్ తో ఇది మంచి బిజినెస్ చేయోచ్చు అన్న ఆలోచనతో ముందడుగు వేస్తున్నారుట. ఆ నిర్మాణ సంస్థ ఏది? అంటే యూవీ క్రియేషన్స్ అని తెలిసింది.
రష్మిక పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గ స్టోరీ సెలక్ట్ చేసి మంచి బడ్జెట్లో సినిమా చేస్తే? మంచి బిజినెస్ కి ...వసూళ్లకు అవకాశం ఉంటుందని భావిస్తోందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని సమాచారం. ఇది జరగాలంటే రష్మిక పూర్తి స్థాయిలో డేట్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఆమె నటిగా చాలా బిజీగా ఉంది. బల్క్ గా డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అలా కేటాయించాలంటే ఏదో ఒక సినిమాని వదులుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ అనుష్కతో ఘాటి అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.