డబుల్ వయసున్న హీరోతో వేగేదెలా రష్మికా?
తన కంటే డబుల్ వయసున్న కథానాయకులతో కలిసి నటించిన హీరోయిన్లు ఉన్నారు. శ్రీదేవి అప్పట్లో తనకంటే రెట్టింపు వయసు ఉన్న ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు.;
తన కంటే డబుల్ వయసున్న కథానాయకులతో కలిసి నటించిన హీరోయిన్లు ఉన్నారు. శ్రీదేవి అప్పట్లో తనకంటే రెట్టింపు వయసు ఉన్న ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు. ఏఎన్నార్ తో నటించిన శ్రీదేవి అక్కినేని వారసుడు నాగార్జున సరసన కూడా నటించడం విశేషం. అయితే ఇప్పుడు రష్మిక మందన్న కూడా అలాంటి ఒక ఫేజ్ లో ఉంది. ఈ భామ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో విజయాలు అందుకుంటూ కథానాయకుల పాలిట లక్కీ ఛామ్ గా మారింది. దీంతో బడా హీరోలంతా రష్మికకు అవకాశాలు కల్పిస్తున్నారు.
ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించిన సికందర్ టీజర్ విడుదల కాగా, దీనిపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. తనకంటే రెట్టింపు వయసున్న సల్మాన్ ఖాన్ (60)తో రష్మిక (30) నటించడం వింతగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ జంట నడుమ వయసు అంతరం మంటలు పుట్టిస్తోంది.
అయితే సగం వయసున్న హీరోయిన్లతో నటించడం మన హీరోలకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించింది. కానీ ఆ సినిమాలో కాజల్ - చిరు జంటను దర్శకుడు ఎంతో డిగ్నిఫైడ్ గా చూపించారు. ఇటీవల రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే, శ్రీలీల వంటి క్యూటీలు నటించినప్పుడు ఏజ్ గ్యాప్ గురించి చాలా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.
కొన్నిసార్లు కథలో ఆ పాత్ర మిళితం అయిపోతే విమర్శలు ఉండవు. కానీ నాన్ సింక్ గా ఉంటేనే విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సికందర్ టీజర్ చూడగానే సల్మాన్- రష్మిక మధ్య ఏజ్ సింక్ అవ్వలేదని ట్రోలర్లు విమర్శిస్తున్నారు. అయితే మురుగదాస్ బలమైన కథ, కథనాలు, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని నడిపిస్తున్నాడు కాబట్టి, జనం దృష్టి హీరోయిన్ పై పెద్దగా ఉండకపోవచ్చు. ఇది పూర్తిగా సల్మాన్ భాయ్ మాస్ మసాలా యాక్షన్ సినిమా అని అర్థమవుతోంది.
అయితే ఇందులో భారీ డైలాగులపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇది రొటీన్ యాక్షన్ సినిమా అవుతుందని కొందరు ఊహిస్తున్నారు. సలార్ లోని యాక్షన్ ఎపిసోడ్స్ తోను పోల్చి చూపిస్తూ సల్మాన్ ని విమర్శిస్తున్నారు. కానీ ఏ.ఆర్.మురుగదాస్ తనదైన మ్యాజిక్ తో ఇతర యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాని ఎలా మలిచారు? ఇందులో ఎలాంటి సందేశం ఇచ్చారు? అన్నదే విజయాన్ని అందించగలదని విశ్లేషిస్తున్నారు.