బాహుబలి రికార్డులదొంతరలో మరొక అసామాన్యమైన రికార్డు వచ్చి చేరింది. ఇప్పటివరకూ వెండితెరనే టార్గెట్ చేసిన ఈ చారిత్రాత్మక చిత్రం ఇప్పుడు బుల్లితెరపై సైతం తన విశ్వరుపాన్ని చూపించింది. విడుదలై యాభె రోజులు దాటినా బాహుబలి పార్ట్ 1 సినిమా శాటిలైట్ హక్కులు ఇప్పటికీ చిత్ర నిర్మాతల చేతిలోనే వున్నాయన్న వార్తను ఇటీవలే ప్రచురించాం. అయితే తాజా సమాచారం ప్రకారం వీటిని ఒక ప్రముఖ ఛానల్ సొంతం చేసుకుంది.
విశేషమేమిటంటే బాహుబలి బిగినింగ్ నే కాక కంక్లుజన్ యొక్క శాటిలైట్ హక్కులను సైతం ఒకేసారి ప్రముఖ తెలుగు చానల్ మా టి.వి సొంతం చేసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా ఈ రెండు భాగాలకు కలిపి 30కోట్లకు బేరం కుదుర్చుకున్నట్టు సమాచారం. పది కూడా దాటని తెలుగు సినిమా శాటిలైట్ హక్కులను ఇంతటి భారీ వ్యయంతో సొంతం చేసుకుని అటు ఆ చానల్ ఇటు ఈ సినిమా రికార్డులలో నిలిచాయి. అంతేకాక ఒక సినిమాకి సంబంధించిన ఒక్క బిట్ కూడా బయటపడకుండానే హక్కులను అమ్మేసిన చిత్రంగా బాహుబలి 2 మరో రికార్డుని సొంతం చేసుకుంది. ఇంతకీ బాహుబలి ది బిగినింగ్ ఏ పండక్కి ప్రసారమవుతుందంటారు...