సాయి పల్లవి వ్యక్తిత్వానికి ఫ్యాన్ అయిపోయా: చందూ మొండేటి
స్టార్ హీరోయిన్ తో సినిమా అంటే ఆమె కోసం రెమ్యూనరేషన్ పరంగానే కాదు, మిగిలిన రూపాల్లో కూడా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంటుంది.
స్టార్ హీరోయిన్ తో సినిమా అంటే ఆమె కోసం రెమ్యూనరేషన్ పరంగానే కాదు, మిగిలిన రూపాల్లో కూడా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంటుంది. ఆ హీరోయిన్ ఎక్కడికి వెళ్లినా వెంట ఓ ఐదాగురు స్టాఫ్ ను మెయిన్టెయిన్ చేస్తూ ఉంటుంది. మేకప్ కోసం మళ్లీ స్పెషల్ గా మరో టీమ్. దానికి తోడు ఓ కారవాన్ కావాలి.
వేరే లొకేషన్ లో షూటింగ్ అన్నప్పుడు ఆమెతో పాటూ తన స్టాఫ్ కు కూడా బిజినెస్ క్లాస్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం దగ్గర నుంచి స్టార్ హోటల్స్ ను కూడా వారి కోసం ఏర్పాటు చేయాలి. హీరోయిన్లంతా ఇంతే ఉంటారని కాదు కానీ చాలా మంది మాత్రం ఇంతే ఉంటారు. వాళ్లు ఏ ప్రదేశంలో ఉన్నా ఈ హడావుడి కచ్ఛితంగా కావాల్సిందే.
అయితే సాయి పల్లవి ఈ లిస్ట్ లో లేకపోవడమే కాదు. ఆమె ఎంత సింపుల్ గా ఉంటుందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారంటున్నాడు తండేల్ సినిమా డైరెక్టర్ చందూ మొండేటి. ఈ రోజుల్లో సాయి పల్లవి లాగా మరో హీరోయిన్ ఉండలేదని, వేరే హీరోయిన్ల లాగా తనతో పాటూ స్టాఫ్ ఎవరూ ఉండరని, ఆమె ఒక్కటే షూటింగ్కు వచ్చేస్తుంటుందని తెలిపాడు.
అంతే కాదు షూటింగ్ లో కూడా మేకప్ కు చాలా దూరంగా ఉంటుందని, సన్ స్క్రీన్ ఒకటి రాసుకుని సీన్ చేసేస్తుందని, షూటింగ్ టైమ్ లో ఎలాంటి ఇబ్బందులెదురైనా వాటిని చాలా ఓపికతో ఎదుర్కొంటుందని వెల్లడించాడు చందూ. తండేల్ సినిమాలో సముద్రంలో రిస్కీ సీన్స్ తీసినప్పుడు కూడా ఎవరి హెల్ప్ లేకుండా తన పని తానే చేసుకుందని చందూ తెలిపాడు.
లొకేషన్ మారేటప్పుడు కూడా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కు నడుచుకుంటూనే వస్తుందని, నటిగా సాయి పల్లవి గురించి కొత్తగా ఇప్పుడు చెప్పే స్థాయి ఆమె ఎప్పుడో దాటిపోయిందని, కానీ తండేల్ కు వర్క్ చేస్తున్న టైమ్ లో తన వ్యక్తిత్వానికి పెద్ద ఫ్యాన్ అయిపోయానని చందూ ఈ సందర్భంగా చెప్పాడు. ఇదిలా ఉంటే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవర 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.