ఆసియా ప్రతినిధిగా రానా

Update: 2017-07-30 08:58 GMT
రానా దగ్గుబాటి.. ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియా లోనే కాదు ఇండియా సినిమా మొత్తం మాట్లాడుకుంటుంది. సినిమా ఫ్యామిలి నుండి పెద్ద్ ప్రొడ్యూసర్ మనవడుగా వచ్చిన రానా సినిమా పై తనకున్న పిచ్చి అభిమానం తో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. హీరోగా కాకముంది నుండే ఫిల్మ్  ప్రొడక్షన్ లో కొన్ని వ్యాపారాలు కూడా చేశాడు. 2006 లో ‘ఏ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్’ అనే సినిమాను కూడా నిర్మించి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. నటుడుగా ప్రొడ్యూసర్ గా డిజిటల్ ప్రొడక్షన్ వ్యాపారవేత్తగా రానా విబిన్న పాత్రలలో నిర్వహిస్తు తాతకు తగిన మనవడు గా పేరు తెచ్చుకుంటున్నాడు.

తెలుగులో లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తరువాత కేవలం తెలుగు సినిమాలుకు మాత్రమే పరిమతం కాకుండా తమిళ్, హింది సినిమాలు కూడా చేస్తూ నేషనల్ నటుడు అయ్యాడు రానా. ఇప్పుడు బాహుబలి ఘన విజయంతో ప్రపంచ దృష్టిని కూడా ఆకట్టుకున్నాడు. తన ఆలోచనలుతో సౌత్ ఇండియా డిజిటల్  ప్రొడక్షన్ రంగంలో చాల మార్పులుకు కారకుడు అయ్యాడు. ఇప్పుడు రానా ఖాతాలో మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్టు వచ్చి వాలింది. లండన్ డిజిటల్ మూవీ అండ్ టి‌వి స్టూడియో వాళ్ళు ఒక ఫిల్మ్ కోసం రానా ను అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు తొందరలో మొదలుకానుంది. అంతే కాకుండా ఆ స్టూడియో కి  రానా ఏసియన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నాడు. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రాజెక్టు 2018లో మొదలుకాబోతుంది. ఈ సినిమాలో ఒక హాలీవుడ్ ఫేమస్ స్టార్ హీరోయిన్ గా నటిస్తుందట.

నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రచారం కూడా రానా అందరి కన్నా కొత్తగా చేశాడు. 3డి పోస్టర్ ఒకటి విడుదల చేసి ప్రచారం లోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో రానా కు జోడీగా నటిస్తుంది. ఆగష్టు 11 నాడు ఈ సినిమాను తమిళ్ తెలుగు లలో విడుదల చేయడానికి సిద్దం చేస్తున్నారులే.
Tags:    

Similar News