ప్రభాస్‌ హీరోయిన్‌ ఇమాన్వి పారితోషికం అంత తక్కువా?

ప్రభాస్‌ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.

Update: 2024-11-27 05:30 GMT

ప్రభాస్‌ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. పారితోషికంతో పాటు లాభాల్లో వాటాను సైతం నిర్మాతల నుంచి అందుకుంటున్న ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రతి సినిమాలోనే స్టార్‌ హీరోయిన్స్‌, క్రేజీ హీరోయిన్స్ నటిస్తున్నారు. కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాలో మాత్రం కొత్త అమ్మాయి, సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకున్న ఇమాన్వి నటిస్తోంది. ప్రభాస్‌కి సరి జోడీ అంటూ షూటింగ్‌ ప్రారంభం రోజే ప్రేక్షకులతో అనిపించుకుంది.

ఫౌజీ అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు. త్వరలోనే టైటిల్‌ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను ప్రభాస్‌ రూ.100 కోట్లకు పైగా పారితోషికంగా అందుకుంటున్నాడు. ఇదే సినిమాలో ప్రభాస్‌కి జోడీగా నటిస్తున్న ఇమాన్వి కనీసం కోటి రూపాల పారితోషికం కూడా అందుకోవడం లేదని తెలుస్తోంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇమాన్వికి రూ.20 లక్షల పారితోషికంను ఆఫర్‌ చేయడం జరిగింది. ఆమె ఇప్పటి వరకు పెద్దగా సినిమాలు ఏమీ చేయక పోవడంతో ఆ పారితోషికం ఆమెకు పెద్ద మొత్తమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రభాస్ వంటి స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్‌కి పారితోషికం కోట్లలో ఉంటుంది. కానీ దర్శకుడు హను రాఘవపూడి కొత్త అమ్మాయిని, అది కూడా సోషల్‌ మీడియాలో రీల్స్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న అమ్మాయిని హీరోయిన్‌గా ఎంపిక చేయడం వల్ల పారితోషికం చాలా తక్కువగా ఉంది. పారితోషికం విషయంలోనే కాకుండా ఇమాన్వి డేట్ల విషయలోనూ దర్శకుడు హను రాఘవపూడికి అనుకూలంగా ఉందట. ప్రభాస్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు డేట్లు ఇచ్చేది చెప్పలేని పరిస్థితి. అందుకే ఆయన డేట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఇమాన్వితో ఏడాది పాటు ఒప్పందం చేసుకున్నారట.

హను రాఘవపూడి హీరోయిన్స్ ఎంపిక విషయంలో ఎప్పుడూ ప్రశంసలు దక్కుతూ ఉంటాయి. 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన హను రాఘవపూడి సీతారామం సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ను ఇండస్ట్రీకి తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఇమాన్విని టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు. మొదటి సినిమాకు రూ.20 లక్షలు తీసుకుంటున్న ఇమాన్వి తన రెండో సినిమాకు కోటి రూపాయలు, అంతకు మించి తీసుకున్నా ఆశ్చర్యం లేదు. హను రాఘవపూడి హీరోయిన్స్ ను చాలా అందంగా చూపించడం ద్వారా ప్రేక్షకులు వారికి ఫ్యాన్స్‌గా మారిపోతారు. అందుకే ఇమాన్వి ఫ్యూచర్‌ స్టార్‌ హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆమె పారితోషికం తక్కువ అనిపించినా ఆమె ఫ్యూచర్‌లో అత్యధిక పారితోషికం అందుకోబోతున్న హీరోయిన్‌గా నిలవడం ఖాయం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News