`కాంతార` ప్రీక్వెల్ లో భారీ వార్ సీక్వెన్సా?
ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ సినిమాలో గ్రాండ్ గా ఓ వార్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
రిషబ్ శెట్టి స్వీయా దర్శకత్వంలో `కాంతార` ప్రీక్వెల్ భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `కాంతార` పాన్ ఇండియాలో అనూహ్య విజయాన్ని నమోదు చేయడంతో ప్రీక్వెల్ పై అంచనాలు పీక్స్ కి చేరి పోతున్నాయి. ఓ కన్నడ నటుడి సినిమా అయినా తెలుగులో సినిమాపై భారీ బజ్ నెలకొంది. ప్రీక్వెల్ ని ఎంత ఆసక్తికరంగా మలచబోతున్నాడు అన్నది సర్వాత్రా ఆసక్తి నెలకొంది. కథలో ఇప్పటికే ఎన్నో థ్రిల్లింగ్ అంశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ సినిమాలో గ్రాండ్ గా ఓ వార్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్ సీక్వెన్స్ కోసం అంతర్జాతీయ నిపుణుల్ని రంగంలోకి దించుతున్నారట. ఈ వార్ సీక్వెన్స్ మునుపెన్నడు చూడని విధంగా ఉంటుందంటున్నారు. ఈ వార్ సీన్ ఎంతో రియల్ స్టిక్ ఎక్స్ పీరియన్స్ అందించేలా ఉంటుందట. దీనిలో భాగంగా రిషబ్ శెట్టి కొన్ని నెలలుగా కలరిపయట్టులో ప్రత్యేక శిక్షణ తీసుకుంటు న్నాడట.
తనతో పాటు ఆ వార్ సీన్ లో భాగమయ్యేవారంతా కూడా నిపుణుల సమక్షంలో ట్రైనింగ్ పొందుతున్నారుట. ఆ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికే నెల రోజులు సమయం పడుతుందని అంటున్నారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరణ 80 శాతం పూర్తయిన తర్వాత చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. `కలరిపయట్టు` కేరళలోని ప్రపంచంలోని పురాతన , కష్టతరమైన యుద్ధ కళలలో ఒకటి. ఇప్పటికే కొన్ని సినిమాల్లో ఈ కళ పై కొన్ని సన్నివేశాలు కూడా తీసారు.
తొలి భాగంలో రిషబ్ శెట్టి `భూతకొలాటాన్ని` ఆధారంగా చేసుకున్నారు. రెండవ భాగంలో మరింత లోతుగా విశ్లేషణ చేసి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయన్నది చెప్పాల్సిన పనిలేదు. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందనే అంచనాలున్నాయి. తొలి భాగంలో పాత్రలతో పాటు అదనంగా మరిన్ని పాత్రలు తెరపై కనిపించనున్నాయి.