సిద్ శ్రీరామ్ ని నిజంగానే దూరం పెట్టారా..?
ఫిబ్రవరి 15న హైదరాబాద్ లో సిద్ శ్రీరామ్ లైవ్ కన్సర్ట్ జరగనుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చాడు సిద్ శ్రీరామ్.
యువ గాయకుడు సిద్ శ్రీరామ్ గాన మాధుర్యం గురించి అందరికీ తెలిసిందే. అతని స్వరం నుంచి ఏ పాట వచ్చినా అది సూపర్ హిట్టే. ఆమధ్య ప్రతి సినిమాలో సిద్ శ్రీరామ్ పాట కచ్చితంగా ఉండాల్సిందే అన్నట్టుగా సిద్ వెంట పడ్డారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈమధ్య అతని పాటలు ఎక్కడ వినిపించట్లేదు. కొత్త పాటలు కూడా ఏవి పెద్దగా పాడినట్టు కనిపించట్లేదు. ఐతే దీనిపై ఇంట్రెస్టింగ్ గా రెస్పాండ్ అయ్యాడు సిద్ శ్రీరామ్.
ఫిబ్రవరి 15న హైదరాబాద్ లో సిద్ శ్రీరామ్ లైవ్ కన్సర్ట్ జరగనుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చాడు సిద్ శ్రీరామ్. ఐతే ఈ క్రమంలో అతన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు దూరం పెడుతున్నారనే ప్రశ్నకు కారణం తెలియదని అన్నాడు. అంతేకాదు పుష్ప 1 లో శ్రీవల్లి సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా పుష్ప 2 లో అతన్ని పాడించకపోవడంపై కూడా దానికి దేవి శ్రీ ప్రసాద్ ఆన్సర్ ఇస్తారని అన్నాడు.
సిద్ శ్రీరామ్ పాడితే ఆ పాట సూపర్ హిట్టే.. ఆ క్రేజ్ తోనే అతని డిమాండ్ పెరిగింది. దాని వల్ల అతని రెమ్యునరేషన్ కూడా పెరిగింది. రెమ్యునరేషన్ వల్లే అతనితో కొందరు పాటలు పాడించడానికి ముందుకు రావట్లేదన్న టాక్ కూడా ఉంది. ఐతే సిద్ శ్రీరాం మాత్రం మ్యూజిక్ డైరెక్టర్స్ అవకాశం ఇస్తేనే కదా తాను పాడతా అంటూ చెప్పుకొచ్చాడు.
ఐతే ఇదే ఇంటర్వ్యూలో సిద్ శ్రీరామ్ తెలుగు మాట్లాడటం కూడా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. పాటలను అంత స్పష్టంగా పాడుతున్నాడు అంటే అతనికి ఎంత బాగా తెలుగు వచ్చో అనుకుంటారు. కానీ సిద్ శ్రీరామ్ కు తెలుగు పెద్దగా రాదు.. మీరు ఎలా ఉన్నారు.. నేను బాగున్నా లాంటి మాటాలనే ఆయన అతి కష్టంగా చెప్పాడు. సో పాటల్లో పాడేది అంతా తన ఓన్ లాంగ్వేజ్ లో రాయించుకుని పాడతాడని చెప్పొచ్చు. ఏది ఏమైనా భాషతో సంబంధం లేకుండా సిధ్ పాడే పాటలు మాత్రలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఐతే సిద్ లైవ్ కన్సర్ట్ కోసం తెలుగు ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ లైవ్ కన్సర్ట్ తో సిద్ మరింత ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో జరగబోతున్న సిద్ శ్రీరామ్ లైవ్ కన్సర్ట్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.