ఐపీఎల్‌లో మెరిసి ఇంతలోనే రహస్య స్నేహితుడితో!
ఇటీవలే ఐపీఎల్ 2025 లాంచింగ్ ఈవెంట్లో మెరుపులు మెరిపించింది దిశా పటానీ. సీకే బ్యూటీ స్టన్నింగ్ పెర్ఫామెన్స్ కి కుర్రకారు ఫిదా అయిపోయారు.;

ఇటీవలే ఐపీఎల్ 2025 లాంచింగ్ ఈవెంట్లో మెరుపులు మెరిపించింది దిశా పటానీ. సీకే బ్యూటీ స్టన్నింగ్ పెర్ఫామెన్స్ కి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక దిశా లేటెస్ట్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. స్టన్నింగ్ బ్యూటీ దిశా పటానీ సిల్వర్ కలర్ ఫ్రాక్‌లో ధగధగల్ని ప్రదర్శిస్తున్న ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంతలోనే తన వ్యక్తిగత జీవితం మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చింది. తాజాగా తన రహస్య స్నేహితుడితో దిశా విందును ఆస్వాధిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాక.. రహస్య సహచరుడి గురించి అభిమానులలో ఉత్సుకత మొదలైంది. అతడు ఎవరో తెలుసుకోవాలనే తపన అందరిలో కనిపిస్తోంది.

వైరల్ వీడియో క్లిప్‌లో దిశా ఒక రెస్టారెంట్‌లో నవ్వుతూ అతడితో సరదాగా మాట్లాడుతూ కనిపించింది. అయితే ఈ ఫుటేజ్ లో అతడు ఎవరో స్పష్ఠంగా కనిపించడం లేదు. ఇది కావాలనే దాపరికం.. ఊరించేందుకు ఇలా చేస్తోంది! అని అంతా ఊహిస్తున్నారు. చాలా మంది నెటిజనులు, ముఖ్యంగా రెడ్డిటర్లు ఈ ఫోటోని స్కాన్ చేసి మరీ చూస్తున్నారు. కానీ అతడు ఎవరో ఇంకా కనిపెట్టలేకపోయారు.

దిషా వ్యక్తిగత జీవితం కొన్నేళ్లుగా మీడియా చర్చల్లో నిలుస్తోంది. దిశా రిలేషన్‌షిప్స్ రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తున్నాయి. ఆరంభం పార్థ్ సమతాన్ అనే టీవీ నటుడితో దాదాపు రెండున్నర సంవత్సరాలు డేటింగ్ చేసిన దిశా.. ఆ తర్వాత అతడి నుంచి బ్రేకప్ అయింది. ఒకరిపై ఒకరికి నమ్మకం సడలిన తర్వాత వారు విడిపోయారు. తర్వాత జాకీ ష్రాఫ్ నటవారసుడు టైగర్ ష్రాఫ్ తో నాలుగేళ్లపాటు దిశా డేటింగ్ చేసింది. ఇద్దరూ అత్యంత సన్నిహితులుగా కొనసాగడంతో చాలా పుకార్లు షికార్ చేసాయి. ఈ జంట రెగ్యులర్ గా ఈవెంట్లలో కలిసి కనిపించారు. అయితే ఈ జోడీ కూడా 2022లో విడిపోయారు. టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ తో దిశా స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తోంది. టైగర్ కూడా దిశాతో స్నేహంగా ఉంటాడు.
టైగర్ నుంచి విడిపోయాక మోడల్, ఫిట్నెస్ కోచ్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కి దిశా సన్నిహితురాలిగా మారింది. ఆగస్టు 2023లో ఒక విందులో అతడిని తన ప్రియుడిగా పరిచయం చేయడంతో వారి రిలేషన్ పై క్లారిటీ వచ్చింది. కానీ ఇటీవల అలెక్స్ కి కూడా దూరంగా ఉంటోంది. దిశా ప్రస్తుతం ఒంటరిగా ఉందని భావిస్తే ఇంతలోనే ఇప్పుడు షాడో మ్యాన్ తో కనిపించింది. ఇంతకీ సీకే బ్యూటీ వెనక షాడో మ్యాన్ ఎవరు? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. దిషా వ్యక్తిగత- వృత్తిపరమైన జీవితం ఎల్లప్పుడూ చర్చల్లో ఉంది. అభిమానులు తాజా వైరల్ డిన్నర్ వీడియో గురించి ఊహాగానాల్లో ఉన్నారు. దిశా లవ్ లైఫ్ లో ఏదైనా కొత్త పరిణామం ఉందా? అనేది తేలాల్సి ఉంది.