లెజెండ్స్ ఇద్దరిలో క్రియేటివిటీ కొరవడిందా?
'ఇండియన్ 3' తర్వాత శంకర్ ఏ హీరోతో పని చేస్తాడు? అన్నది కూడా ఇంత వరకూ క్లారిటీ లేదు. తాజాగా మురగదాస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.;

ఇండియాస్ గ్రేట్ డైరెక్టర్ గా నీరాజనాలు అందుకున్న శంకర్ పరిస్థితి ఇప్పుడెలా ఉంది? అని చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే 'గేమ్ ఛేంజర్' తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతోనైనా బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే? ఉన్న ఇమేజ్ ని సైతం 'గేమ్ ఛేంజర్' ఫలితం డ్యామేజ్ చేసింది. ఆయన సక్సస్ చూసి పదేళ్లు పైనే అవుతుంది. 'స్నేహితుడు' తర్వాత '2.0' యావరేజ్ గా ఆడింది. మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్లే.
భారీ ప్రయోగాలన్నీ ఘోరంగా బెడిసి కొట్టాయి. 'ఐ', 'ఇండియన్ -2' భారీ అంచనాల మద్య వచ్చినా? బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. ఇలా వరుస పరాభావలతో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే? చివరి శంకర్ తీసే `ఇండియన్ 3` ఓటీటీలో రిలీజ్ అవుతుందంట అనేంతగా ప్రతికూల వాతావరణం నెలకొంది. 'ఇండియన్ 3' తర్వాత శంకర్ ఏ హీరోతో పని చేస్తాడు? అన్నది కూడా ఇంత వరకూ క్లారిటీ లేదు. తాజాగా మురగదాస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ఇటీవలే 'సికిందర్' తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ఈసినిమాతో మురగదాస్ బౌస్ బ్యాక్ అవుతాడు? అను కుంటే అంతకంటే ఘోరమైన విమర్శలు ఎదుర్కుంటున్నాడు ఈసినిమాతో. 'సర్కార్' తో భారీ విజయం అందుకున్న మురగ అటుపై 'దర్బార్' తో మరో ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో 'సికిందర్' కోసం ఏకంగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మరీ చేసాడు. కానీ ఫలితం మళ్లీ నిరాశ పరిచింది. రొటీన్ సినిమా తీసాడనే విమర్శలు ఎదుర్కుంటున్నాడు. దీంతో శంకర్-మురగదాస్ పరిస్థితి ఒకేలా కనిపిస్తుంది. ఈ వైఫల్యాలకు రొటీన్ కంటెంట్ ఉన్న స్టోరీలను ఎంచుకోవడం ఓ కారణమైతే? తెరపై పాత్రలను బలంగా చెప్పకపోవడం మరో కారణంగా వినిపిస్తుంది.