2027 లో మహేష్ కొత్త సినిమా షురూ..!
ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఓ పక్క జరుగుతుంది.;

రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా మినిమం 3 ఏళ్లు టైం ఇవ్వాల్సిందే. అతను ఎంత పెద్ద స్టార్ అయినా సరే ముందు ఈ కండీషన్ కి ఒప్పుకుంటేనే రాజమౌళి సినిమా ఓకే చేస్తాడు. బాహుబలి రెండు భాగాలు, RRR సినిమాలకు దాదాపు 8 ఏళ్ల టైం తీసుకున్నాడు జక్కన్న. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఓ పక్క జరుగుతుంది.
రాజమౌళి సినిమా ఎప్పుడు షూటింగ్ సీక్రెట్ గానే కానిస్తాడు. కానీ ఆయన సినిమా మొదలైనప్పటి నుంచి ప్రమోషన్స్ మీద ఒక స్పెషల్ ఫోకస్ చేస్తాడు. RRR టైం లో కూడా సినిమా అనౌన్స్ మెంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్యలో కూర్చుని సినిమా ప్రకటించాడు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ గురించి చెప్పాడు.
కానీ మహేష్ సినిమా గురించి ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ సినిమాను 2 ఏళ్లలో పూర్తి చేసేలా గట్టి ప్లానింగ్ లో ఉన్నారట. రాజమౌళి సినిమా రెండేళ్లలో కష్టమని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. ఐతే 2028 లో మహేష్ సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఐతే మహేష్ మాత్రం 2027 సెకండ్ హాఫ్ లోనే ఫ్రీ అయిపోతాడని టాక్.
సో 2027 లోనే మహేష్ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉందట. ఐతే ఎలాగు రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. అందుకే పాన్ ఇండియా డైరెక్టర్స్ తో సినిమా ఉండేలా చూస్తున్నాడు. ఐతే ప్రస్తుతం మహేష్ తో భారీ సినిమా చేసే పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరా అని చర్చిస్తున్నారు.
త్రివిక్రం ఎలాగు బన్నీతో లాక్ అయ్యాడు. సుకుమార్ రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయి. మరి రాజమౌళి తర్వాత మహేష్ ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తాడన్నది పెద్ద సస్పెన్స్ గా ఉంది. ఐతే ఈ సినిమా విషయంలో ఎలాంటి క్లూ దొరికినా కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.