వాణీ కాదు కత్రిన అంటూ ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్

ఈ ఫోటోని పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లు చెల‌రేగిపోయారు. చాలా మంది ఈ అసాధారణ పోలిక‌ల‌పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.;

Update: 2025-03-29 03:47 GMT
వాణీ కాదు కత్రిన అంటూ ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్

బాలీవుడ్ నటి వాణి కపూర్ ఆహా క‌ళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలు. వార్ 2లోను ఈ బ్యూటీ న‌టించింది. ప‌లు హిందీ హిట్ చిత్రాల్లో న‌టించింది. ఇటీవల తన ఇన్‌స్టాలో ఒక అద్భుతమైన సెల్ఫీని షేర్ చేసింది వాణీ. త‌న‌ అభిమానులు, ఫాలోవ‌ర్స్ నుండి ప్రశంసలు అందుకుంది. అయితే ఇది క‌త్రిన కాదు క‌దా! అంటూ అంద‌రూ సందేహం వ్య‌క్తం చేసారు. ఈ ఫోటోలో కత్రినా కైఫ్‌తో వాణీ స‌రిగ్గా పోలి ఉంది.


ఈ ఫోటోని పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లు చెల‌రేగిపోయారు. చాలా మంది ఈ అసాధారణ పోలిక‌ల‌పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొంద‌రు మొదట వాణీని కత్రిన అనుకుని క‌న్ఫ్యూజ్ అయ్యారు. ఈ ఫోటోలో వాణీ ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించింది. వాణీ ఫ్లోర‌ల్ సల్వార్ సూట్ ధరించి కనిపించింది. చిన్న నల్ల బిందీని ధరించిన ఈ బ్యూటీ సింపుల్ మేక‌ప్ తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

సెల్ఫీకి ప్రతిస్పందిస్తూ, ఒక నెటిజ‌న్ ``ఈ సెల్ఫీలో మీరు కత్రినా లాగా కనిపిస్తున్నారు... నేను అయోమయంలో ఉన్నాను`` అని వ్యాఖ్యానించారు. మరొకరు, ``1 సెకను నేను ఆమె కత్రినా కైఫ్ అని అనుకున్నాను` అని రాశారు.

``కత్రినా కైఫ్ + రుహానీ శర్మ = కొంచెం వాణి అంటూ త‌మాషాగా రాసారు. వాణీ సెల్ఫీపై ప్ర‌శంస‌ల‌తో పాటు సందేహాలు అలానే ఉన్నాయి. నిజానికి వాణీని క‌త్రిన‌తో పోల్చ‌డం ఇదే మొద‌టి సారి కాదు. జూలై 2022లో షంషేరా ట్రైలర్ విడుదలైన తర్వాత వాణి పాత్రను `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`లో కత్రినా కైఫ్ పాత్రతో పోల్చారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. చివరిసారిగా ఖేల్ ఖేల్ మెయిన్‌లో అక్షయ్ కుమార్, అమ్మీ విర్క్, తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్ త‌దిత‌రుల‌తో కలిసి కనిపించింది. అక్టోబర్ 2024లో వాణి పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ తో కలిసి రొమాంటిక్ కామెడీ చిత్రం అబీర్ గులాల్ షూటింగ్ కోసం లండన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా విడుదల గురించి ఇంకా ఎటువంటి అప్ డేట్ లేదు. అజయ్ దేవగన్, రితేష్ దేశ్ ముఖ్ లతో కలిసి రైడ్ 2 లో కూడా కనిపిస్తుంది. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.

Tags:    

Similar News