ప్రగ్య అండ్ గ్యాంగ్‌తో పార్టీలో షాడో మ్యాన్!
నీటిలో పడవ (మర బోట్) ప్రయాణిస్తోంది. ఆ పడవలోనే అసలు తతంగం అంతా. మంచు లక్ష్మీ- ప్రగ్య జైశ్వాల్ - సీరత్ కపూర్ .. స్నేహితురాళ్ల హంగామా మామూలుగా లేదు.;

నీటిలో పడవ (మర బోట్) ప్రయాణిస్తోంది. ఆ పడవలోనే అసలు తతంగం అంతా. మంచు లక్ష్మీ- ప్రగ్య జైశ్వాల్ - సీరత్ కపూర్ .. స్నేహితురాళ్ల హంగామా మామూలుగా లేదు. పార్టీ పీక్స్ లో మొదలైంది. అయితే ఈ పార్టీలో టాలీవుడ్ నుంచి ఒక యంగ్ హీరో కూడా ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ ఎవరు ఆ యంగ్ హీరో? అంటే డీటెయిల్స్ లోకి వెళ్లాలి.

ప్రస్తుతం మంచు లక్ష్మి- ప్రగ్య జైశ్వాల్ ముంబై సర్కిల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరంతా అక్కడ సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. ఇంతలోనే ఇప్పుడు యువహీరో నవదీప్ ఈ బృందంతో కనిపించాడు. ప్రగ్య జైశ్వాల్ అండ్ టీమ్ తో కలిసి అతడు ఫోజులివ్వగా అవన్నీ వైరల్ గా మారుతున్నాయి. అల్లరి బృందం ఇలా ఓచోట కలిసింది అంటే దీని వెనక చాలా అర్థం ఉంది. వీరంతా ఇప్పడు ఒక ప్రాజెక్ట్ కోసం కలిసారా? అని ఆరాలు మొదలయ్యాయి.

అయితే ప్రగ్య జైశ్వాల్ తాజాగా ఇన్ స్టాలో గ్రూప్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి నవదీప్ తదుపరి ప్రాజెక్ట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ ఫోటోగ్రాఫ్ లో నవదీప్ - సీరత్ కపూర్ కూడా కనిపిస్తున్నారు. ఈ జంట కలిసి నటిస్తున్నారా లేదా? అన్ని చూడాలి. ప్రగ్య జైశ్వాల్ యూనిక్ ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. యాచ్ పార్టీలో వారి సాన్నిహిత్యం అందరి దృష్టిని ఆకర్షించింది.