వీల్ చైర్‌లో శ్రీవల్లి.. షాకింగ్ వీడియో
తాజాగా ఎయిర్ పోర్ట్‌లో రష్మిక మందన్న కనిపించింది. మొహానికి పూర్తిగా మాస్క్ ధరించి, గుర్తు పట్టకుండా జాగ్రత్త పడింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం మూడు నాలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. అందులో ఒకటి రెండు షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి. కొన్ని సినిమాలు మాత్రం ఆరంభ దశలో ఉన్నాయి. ఈ సమయంలో రష్మిక జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఉండగా చిన్న ప్రమాదం జరిగి కాలు బెణికింది. దాంతో ఆమె నడవలేక పోతుంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన రష్మికకు వైద్యులు కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరం అని చెప్పారట. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు కాళుకు విశ్రాంతి ఇస్తేనే బాగుంటుందని వైద్యులు సూచించారని సమాచారం అందుతోంది.
తాజాగా ఎయిర్ పోర్ట్‌లో రష్మిక మందన్న కనిపించింది. మొహానికి పూర్తిగా మాస్క్ ధరించి, గుర్తు పట్టకుండా జాగ్రత్త పడింది. అయితే అక్కడ ఉన్న మీడియా వారు రష్మికను గుర్తించారు. కారు దిగిన రష్మిక నడవడానికి ఇబ్బంది పడింది. దాంతో ఆమెను వీల్ చైర్‌లో ఎక్కించి లోనికి తీసుకు వెళ్లారు. ఎయిర్ పోర్ట్‌లో ఎప్పుడు జింక పిల్ల మాదిరిగా చెంగు చెంగున ఎగురుకుంటూ నడిచే రష్మిక మందన్న ఇలా వీల్ చైర్‌కి పరిమితం కావడం పట్ల ఆమె అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 సినిమాలో శ్రీవల్లిగా రష్మిక వేసిన డాన్స్, ఆమె చేసిన యాక్టింగ్‌ను ప్రేక్షకులు మరచిపోలేరు. అలాంటి శ్రీవల్లి ఇలా వీల్ చైర్‌కి పరిమితం కావడం పట్ల పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యానిమల్ సినిమాతో హిందీ ప్రేక్షకులను మెప్పించిన రష్మిక మందన్న తాజాగా పుష్ప 2తో మరోసారి అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు రష్మిక నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక హిందీలో ఈమె నటించిన చావా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే రష్మిక ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి సర్‌ప్రైజ్ చేశారు. గత డిసెంబర్‌లోనే విడుదల చేయాలని భావించినా పుష్ప 2 కి పోటీ వద్దు అనుకుని వాయిదా వేశారు. త్వరలోనే చావా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చావా తో పాటు బాలీవుడ్‌లో మరో రెండు సినిమాలను రష్మిక మందన్న చేస్తుంది. అందులో ఒకటి సల్మాన్ ఖాన్‌తో కావడం విశేషం.
గర్ల్ ఫ్రెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలోనే ఈ అమ్మడు రాబోతుంది. ఇక ధనుష్ తో కలిసి కుబేరా సినిమాలో శేఖర్ కమ్ముల సినిమాలో నటించింది. సమ్మర్‌లో కుబేరా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కనుక కుబేరా సినిమాతో తమిళ్, తెలుగులో ప్రేక్షకులను ఈ అమ్మడు అలరించడం కన్ఫర్మ్. ఇంకా ఈ అమ్మడు కొత్త సినిమాలకు సైన్ చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో వీల్ చైర్‌కి రష్మిక మందన్న పరిమితం కావడం పట్ల అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్మిక కొన్నాళ్ల వరకు షూటింగ్‌లో పాల్గొనలేదు. దాంతో ఆమె నటిస్తున్న సినిమాల విడుదల తేదీల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. టాలీవుడ్ హీరోతో ఈమె పెళ్లి ఇదే ఏడాది అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ గాయం కారణంగా పెళ్లి కూడా వాయిదా పడుతుందేమో చూడాలి.