53వ వసంతంలో నమ్రత.. ఆ అందానికి అసలు రహస్యమిదే..
అందానికి వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించిన నమ్రత శిరోద్కర్ తన 53వ పుట్టినరోజుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అందానికి వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించిన నమ్రత శిరోద్కర్ తన 53వ పుట్టినరోజుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రత్యేక సందర్భంలో ఆమె భర్త, సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రతకు అద్భుతమైన గ్రీటింగ్‌తో ఒక పోస్టును షేర్ చేశారు. “హ్యాపీ బర్త్‌డే, NSG! ప్రతి రోజును మరింత ప్రకాశవంతంగా, మెరుగ్గా మార్చినందుకు ధన్యవాదాలు. నువ్వు నేటి మాదిరిగానే ఎల్లప్పుడూ అద్భుతమైన మహిళగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను!” అంటూ మహేష్ రాసిన మెసేజ్ నెటిజన్లను ఆకట్టుకుంది.
ఈ సందేశానికి తోడు మంచులో ఉంచిన చెక్క బెంచిపై నమ్రత కూర్చుని ఉన్న అందమైన ఫోటోను జతచేశారు. 53 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నమ్రత తన అందానికి గల రహస్యాలను పంచుకున్నారు. తగినన్ని నీళ్లు తాగడం, మంచి నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజా పండ్లు కూరగాయలతో సమతుల ఆహారం తీసుకోవడం ఆమె ఫిట్‌నెస్ యాంటీ-ఎజింగ్‌కు ప్రధాన కారణాలని తెలిపారు.
అంతేకాదు, ధూమపానం వంటి అలవాట్లను దూరంగా ఉంచి, ఒత్తిడిని తగ్గించుకోవడంలో ఆమె స్పెషలైజ్ అయింది. చిన్న చిన్న ముడతలను తగ్గించడానికి విటమిన్ Cను, చర్మానికి తేమను అందించేందుకు ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లను, అలాగే ప్రొఫిలో పికో లేజర్ వంటి చికిత్సలను ఉపయోగించడం ద్వారా ఆమె తన చర్మాన్ని నిగారింపుగా ఉంచుతోందట.
నమ్రత అందం కేవలం చర్మ సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు. ధ్యానం, రిలాక్సేషన్‌కు సమయం కేటాయించడం ఆమెకి సహాయం చేస్తుందని నమ్రత చెబుతున్నారు. ఈ ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల ఆమె రెగ్యులర్ గా కాకుండా సుందరంగా కనిపిస్తుంటారు. ప నమ్రత ప్రయాణం 1993లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకోవడం నుండి ప్రారంభమై, బాలీవుడ్ మరియు సౌత్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడం వరకు చాలా విజయాలను అందించింది.
1998లో "జబ్ ప్యార్ కిసిసే హోటా హై"లో సల్మాన్ ఖాన్ సరసన సినీ కెరీర్ ను ప్రారంభించిన ఆమె, "వంశీ" సినిమా సమయంలో మహేష్ బాబుతో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, 2005లో వివాహం దాకా వెళ్లింది. ప్రస్తుతం నమ్రత తన కుటుంబ బాధ్యతలను మెరుగ్గా నిర్వహిస్తూ, ఒక సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్గా నిలుస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లిగా, మహేష్ భార్యగా ఆమె ప్రతి రోజుని మరింత అద్భుతంగా మార్చుకుంటున్నారు. కెరీర్‌లో గ్యాప్ వచ్చినా, వ్యక్తిగత జీవితంలో ఆమె విజయాలు ఆమె అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.