అందుకే బాహుబలి టీమ్‌ వెరీ స్పెషల్‌

Update: 2015-07-06 13:30 GMT
'బాహుబలి'ని ఇప్పుడెవ్వరూ తెలుగు సినిమాగా చూడట్లేదు. దాన్ని ఓ ఇంటర్నేషనల్‌ మూవీలాగే ట్రీట్‌ చేస్తున్నారు. ఐతే ఆ స్థాయిలో సినిమాను ప్రమోట్‌ చేయడంలో బాహుబలి టీమ్‌ పడ్డ కష్టాన్ని, సోషల్‌ మీడియా ద్వారా వాళ్లు వినూత్నంగా సినిమాకు ప్రచారం చేసిన విధానాన్ని అభినందించి తీరాలి. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా 'బాహుబలి'ని ఓన్‌ చేసుకుని.. ఈ సినిమాను ప్రమోట్‌ చేయడాన్ని తమ బాధ్యతగా భావించాయంటే బాహుబలి టీమ్‌ సిన్సియారిటీ ఓ కారణమని చెప్పాలి. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండగా.. 'బాహుబలి'ని పైరసీలో చూడొద్దంటూ టీమ్‌ బాహుబలి ఇచ్చిన అప్పీల్‌ అందరినీ ఆలోచింపజేసి ఉంటుందనడంలో సందేహం లేదు.

రాజమౌళి సహా తామందరం ఎన్ని రోజులు ఎంత కష్టపడ్డామో వివరిస్తూ పైరసీకి దూరంగా ఉండమంటూ ఇచ్చిన అప్పీల్‌.. పైరసీ చేసేవాళ్లు, చూసేవాళ్లలో ఒక చిన్న కదలికైనా తెచ్చే ఉంటుంది. ఇప్పుడు టీమ్‌ బాహుబలి చేస్తున్న ఇంకో ప్రయత్నం కూడా జనాల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. బాహుబలి సినిమాను తొలి రోజు చూడాలని ప్రేక్షకులు ఎంత తహతహలాడుతున్నారో తెలిసిందే. అందుకోసం ఎంప్లాయీస్‌ ఆఫీస్‌కు బంక్‌ కొట్టేయడానికి రెడీ అయిపోయారు. ఐతే ఈ విషయంలో వాళ్లను ఎక్స్‌క్యూజ్‌ చేయాలంటూ బాహుబలి టీమ్‌ కంపెనీలకు విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ఎంప్లాయిస్‌ ఆ రోజు ఆఫీస్‌కు రాకపోవడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుందన్నది వాస్తవమే అని.. ఐతే ఆ రోజు బాహుబలి లాంటి ఓ మంచి సినిమాను తొలి రోజే చూడాలన్న మంచి కారణంతోనే ఉద్యోగులు సెలవు పెడతారని.. వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది బాహుబలి టీమ్‌. ఇంత మర్యాదగా విజ్ఞప్తి చేస్తే కంపెనీలు  కరిగిపోకుండా ఉంటాయా! మొన్న పైరసీ అప్పీల్‌ తరహాలోనే మరోసాటి టచ్‌ చేసింది కదా బాహుబలి టీమ్‌!



Tags:    

Similar News