ఇంకా బాహుబలి: ది కంక్లూజన్ విడుదలకు 9 నెలల సమయం ఉంది. ఇంతలోనే ఒక భాషలో బిజినెస్ డీల్ క్లోజ్ అయిపోయింది. కే ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్థ బాహుబలి-2 థియేట్రికల్.. శాటిలైట్ రైట్స్ అనూహ్యమైన ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ ద్వారా బాహుబలి నిర్మాతలకు రూ.51 కోట్లు వచ్చి పడ్డాయట. ఇందులో రూ.36 కోట్లు థియేట్రికల్ రైట్స్ కోసం చెల్లించినవైతే.. రూ.15 కోట్లు శాటిలైట్ హక్కుల కోసం చెల్లించినట్లు తెలిసింది.
ఇంకా బాహుబలి-2 తమిళ వెర్షన్ విదేశీ హక్కులు నిర్మాతల దగ్గరే ఉన్నాయి. కేవలం ఒక్క భాషలో థియేట్రికల్ రైట్స్ కే ఇంత మొత్తం వచ్చిందంటే.. మొత్తంగా బాహుబలి: ది కంక్లూజన్ బిజినెస్ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి మేకర్స్ రూ.400 కోట్ల దాకా టార్గెట్ చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. బాహుబలి: ది బిగినింగ్ రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే.
బాహుబలి-1 వేరే భాషల్లో మరీ అంచనాలేమీ లేకున్నా.. అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఇక బాహుబలి-1 మీద ఉన్న అంచనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా రూ.1000 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదేమో. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటున్న బాహుబలి: ది కంక్లూజన్ 2017 ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.