లింగా నిర్మాతకి బాహుబలి థ్రెట్‌

Update: 2015-07-15 07:35 GMT
మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా పవర్‌ సినిమా తీసి లాభాలు ఆర్జించాడు రాక్‌లైన్‌ వెంకటేష్‌. రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పవర్‌ తెరకెక్కించి హిట్‌ కొట్టాడు. ఆ ఒక్క హిట్‌తో ఇటు తెలుగు, అటు తమిళ్‌, కన్నడలోనూ స్టార్‌ ప్రొడ్యూసర్‌గా వెలిగిపోయాడు. సరిగ్గా అదే టైమ్‌లో పవర్‌ ప్రొడ్యూసర్‌ నుంచి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెలుగు, తమిళ్‌ ద్విభాషా చిత్రం లింగా తెరకెక్కుతోందన్న వార్త వచ్చింది. ఆ ఒక్క వార్తతో రాక్‌లైన్‌ రేంజు ఎంతో జనాలకు అర్థమైంది.

వారెవ్వా సూపర్‌స్టార్‌నే లైన్‌లో పెట్టాడే అనుకున్నారు. రజనీతో సినిమా తీసి ప్రపంచాన్ని ఆకర్షించాడు. అయితే లింగా అతడిని ఫడీల్మని తన్నాడు. బాక్సాఫీస్‌ వద్ద దారుణ పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా రాక్‌లైన్‌ ఎంతమాత్రం తగ్గలేదు. అతడు ఏకంగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కండలహీరో సల్మాన్‌ఖాన్‌తో 'భజరంగి భాయిజాన్‌' చిత్రం తెరకెక్కించాడు. మూడు పరిశ్రమల్లో ముగ్గురు స్టార్‌ హీరోల్ని లైన్‌లో పెట్టి అంత భారీ చిత్రాల్ని నిర్మించాడంటే రాక్‌లైన్‌ వెంట ఉన్న భారీ బలగాన్ని, పెట్టుబడిదారుల అండదండల్ని ఊహించవచ్చు. అతడి వెనుక బలమైన శక్తులేవో ఉండి ముందుకు తోస్తున్నాయన్నది అసలు సిసలు నిజం.

అయితే లింగాతో ఫ్లాప్‌ని ఎదుర్కొన్న రాక్‌లైన్‌ ఇప్పుడు భాయిజాన్‌తో హిట్టు కొడతాడా? ఏమో! ప్రస్తుతం బాలీవుడ్‌లో బాహుబలి ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సునామీని తట్టుకుని భజరంగి భాయిజాన్‌ రేసులో నిలిస్తేనే రాక్‌లైన్‌ హిట్టు కొట్టినట్టు. ప్రస్తుతానికైతే అతడికి బాహుబలి థ్రెట్‌ని ఎలా ఎదుర్కొంటాడో  చూడాలి. ఇంకో రెండు రోజులే గడువుంది. కౌంట్‌ డౌన్‌ స్టార్ట్స్‌ నవ్‌.
Tags:    

Similar News