బంగారం వ‌చ్చింది.. బాబు పాటేసుకున్నాడు!

Update: 2016-05-14 07:22 GMT
సినిమా వ‌చ్చి చాలా రోజులైంది కాబ‌ట్టి య‌మా స్పీడుతో క‌నిపించాడు వెంక‌టేష్‌. ఆయ‌న‌కి మారుతిలాంటి స్పీడున్న డైరెక్ట‌రే దొరికాడు కాబ‌ట్టి `బాబు బంగారం` త్వ‌ర‌గానే విడుద‌ల‌వ్వొచ్చేమో అనిపించింది. కానీ ఆ స్పీడు ఎంతోకాలం సాగ‌లేదు. మ‌ధ్య‌లో బంగారం అదేనండీ... మ‌న న‌య‌న‌తార జ‌ల‌క్ ఇచ్చిందట‌. అస‌లే ఆమె త‌మిళంలో ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా వుంది. ఇక తెలుగులో ఒక్క సినిమాకోసం హైద‌రాబాద్‌కి మాటి మాటికీ ఎందుకొస్తుంది చెప్పండి? అందుకే టీమ్‌ ని బాగానే ఇబ్బంది పెట్టింద‌ని వినికిడి. అయినా ఎలాగోలా సినిమాని తుదిద‌శ‌కు తీసుకొచ్చాడు మారుతి. కానీ విదేశాల్లో తీయాల్సిన పాట‌ల ద‌గ్గ‌రకొచ్చేస‌రికి న‌య‌న్ మ‌రిన్ని చుక్క‌లు చూపించింద‌ట‌. ఆమె ఎంత‌కీ డేట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో సినిమా ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ఇంకా ఆల‌స్య‌మైతే క‌ష్ట‌మ‌మ్మా అని వేడుకొన్నారో ఏంటో బంగారం క‌రుణించిన‌ట్టుంది. న‌య‌న‌తార డేట్లు ఇచ్చేసి ఫ్లైటెక్కేసింది.

అందుకే ప్ర‌స్తుతం బాబు బంగారం షూటింగ్ అబ్రాడ్‌ లో జ‌రుగుతోంది. మారుతి ఆ విష‌యాన్ని స్వ‌యంగా ట్వీట్ చేశాడు. లొకేష‌న్లో వెంకీ బాబు ద‌గ్గ‌ర వున్న‌ప్పుడు ఒక ఫోటో, న‌య‌న‌తారతో మాట్లాడుతున్న‌ప్పుడు ఓ ఫోటో తీయించుకొని ట్విట్ట‌ర్‌ లో పెట్టాడు మారుతి. ఫారిన్‌ లో తీస్తున్న పాట‌లైపోతే ఇక సినిమా దాదాపుగా పూర్త‌యిన‌ట్టే అని తెలిసింది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర్వాత మారుతి తీస్తున్న సినిమా ఇదే. అందుకే సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే మారుతి సినిమా తీశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఫ‌స్ట్‌ లుక్‌ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వెంకీ యంగ్‌ గా క‌నిపించాడు. మ‌రి సినిమాలో బాబు ఎలాంటి వినోదాలు పంచుతాడో చూడాలి.
Tags:    

Similar News