అమ్మయిన బిచ్చగాడు హీరోయిన్

Update: 2018-08-02 08:22 GMT
విజయ్ అంటోనీ హీరోగా తెరకెక్కిన 'పిచ్చకారన్' సినిమాను తెలుగు లో 'బిచ్చగాడు' పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఆ సినిమాతో విజయ్ అంటోనీ కి మంచి ఫాలోయింగ్ రాగా, హీరోయిన్ సత్నా టైటస్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సత్నా నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు గానీ ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

మలయాళం హీరోయిన్ అయిన సత్నా టైటస్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, తమిళ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అయిన కార్తీక్ తో లవ్ లో పడడం, సత్నా వాళ్ళ అమ్మగారు వ్యతిరేకించడంతో 2016 లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం జరిగిపోయాయి. ఆ సమయంలో వాళ్ళమ్మగారు పోలీస్ స్టేషన్ లో కార్తిక్ తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని ఒక కేసు కూడా పెట్టారట.  ఆ తర్వాత ఇద్దరూ ఫిబ్రవరి - 2017 లో మళ్ళీ బంధువుల సమక్షంలో మరో సారి పెళ్లి చేసుకున్నారు.  తాజా సమాచారం ఎంటంటే, సత్నా రీసెంట్ గా ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిందట.  దీంతో కార్తీక్, సత్నాల కుటుంబంలో అందరూ ఫుల్లు హ్యాపీ.

ఇక సినిమాల విషయానికి వస్తే, సత్నా ఈమధ్యే శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన 'నీది నాది ఒకే కథ' సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఇప్పుడు పాపతో బిజీ కాబట్టి కొన్ని రోజులు వెండితెరకు దూరమైనట్టే.
Tags:    

Similar News