ఖాన్ వార‌సురాలితో బిగ్ బి మ‌న‌వ‌డి ల‌వ్?

Update: 2022-12-31 09:30 GMT
స‌హ‌న‌టీమ‌ణుల‌తో స్నేహం చేసినా.. క‌లిసి ఔటింగ్ కి వెళ్లినా ఆ హీరోకి ఆ హీరోయిన్ తో సంబంధం అంట‌గ‌ట్టి ప్ర‌చారం చేయ‌డం బాలీవుడ్ మీడియాకు అల‌వాటు వ్యాప‌కం. టీఆర్పీల కోసం రీడ‌బులిటీ కోసం హిందీ-త‌మిళ‌ మీడియాలు ఎలా ఆలోచిస్తాయో మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల ఓ బ‌హిరంగ వేదిక‌పై ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ తీరును బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. స‌హ నాయిక‌ల‌తో హీరోల‌కు ఎఫైర్లు అంట‌గ‌ట్టేంత నీచ‌స్థితికి ఇత‌ర మీడియాల్లా తెలుగు మీడియా దిగ‌జార‌లేద‌ని బాస్ కితాబిచ్చారు.

అదంతా అటుంచితే బాలీవుడ్ లో ఇరువురు  స్టార్ కిడ్స్ కి ఎఫైర్ అంట‌గ‌డుతూ ముంబై మీడియా క‌థ‌నాలు వండి వార్చ‌డం చర్చ‌నీయాంశ‌మైంది. అది కూడా బ‌చ్చ‌న్ ఫ్యామిలీ నుంచి యువ‌హీరోతో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ డేటింగ్ చేస్తోందంటూ హిందీ మీడియా ఊద‌ర‌గొడుతోంది. ఈ డేటింగ్ రూమ‌ర్లు ఎలా పుట్టుకొచ్చాయో కానీ ఇటీవ‌ల ఇరుగుపొరుగు మీడియాల్లోను దావాన‌లంలా మారాయి. కానీ ఇది నిజ‌మా? అంటే వాస్త‌వ వివ‌రాల్లోకి వెళ్లాలి.

ప్ర‌స్తుతం కింగ్ ఖాన్ షారూఖ్ న‌ట‌వార‌సురాలు సుహానా ఖాన్ జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని 'ది ఆర్చీస్' తో క‌థానాయిక‌గా ప‌రిచ‌యమ‌వుతుండ‌గా... బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌డు శ్వేతాబచ్చ‌న్ నంద‌న్ కుమారుడు అయిన అగస్త్య నందా కూడా ఇదే సినిమాతో హీరోగా ప‌రిచ‌యమ‌వుతున్నాడు. ఈ సినిమా సెట్స్ లో ఒక‌రితో యువ జంట‌ ఒక‌రు స‌న్నిహితంగా క‌నిపించ‌డంతో కొత్త పుకార్లు మొద‌ల‌య్యాయి. సుహానాతో అగ‌స్త్య‌ డేటింగ్ చేస్తున్నాడంటూ ఒక‌టే ప్ర‌చారం హోరెత్తుతోంది.

ఆర్చీస్ నటీనటులు సుహానా ఖాన్ - అగస్త్య నందా క్రిస్మస్ రోజున‌ లంచ్ లో కలిసి కనిపించారు. ఇంత‌లోనే ఈ జంట‌ డేటింగ్ పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేయ‌డం మొద‌లైంది. కానీ ఆ ఇద్ద‌రి న‌డుమా ఉన్న‌ది కేవ‌లం స్నేహం మాత్ర‌మేన‌ని ఒక సోర్స్ చెబుతోంది.

జోయా అక్తర్ తెర‌కెక్కిస్తున్న 'ది ఆర్చీస్' 2023 మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒక‌టి. ఈ చిత్రంలో సుహానా ఖాన్- ఖుషీ కపూర్- అగస్త్య నందా- మిహిర్ అహుజా- డాట్- యువరాజ్ మెండా- వేదంగ్ రైనా త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సుహానా- ఖుషీ స్టార్ కిడ్స్ కావ‌డంతో బోలెడంత క్రేజ్ నెల‌కొంది. అగస్త్య నందా.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు కావ‌డంతో అతడి పేరు మార్మోగుతోంది. స్టార్ కిడ్స్ సాన్నిహిత్యం పైనా ర‌క‌ర‌కాల ఊహాగానాలు అప్పుడే మొద‌లైపోయాయి.

సుహానా- అగస్త్య క్రిస్మస్ లంచ్ లో క‌నిపించ‌గానే కొన్ని వెబ్ సైట్ల‌లో ఆ ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్నారంటూ క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. నిజానికి ఆ ఇద్ద‌రూ డేటింగ్ చేసే మూడ్ లో లేర‌ని..ఇది 'ది ఆర్చీస్‌'కు ప్రచార జిమ్మిక్కు గా ఉప‌యోగించిన ఒక స్టింట్ మాత్ర‌మేన‌ని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. క్రిస్మస్ నాడు సుహానా 'ది ఆర్చీస్' సహనటుడు అగస్త్య నందతో పాటు అతని సోదరి నవ్య నవేలి నందా .. తల్లి శ్వేతా బచ్చన్ తో కలిసి ముంబైలోని కపూర్ ఫ్యామిలీ ఇంటికి లంచ్ కి వెళ్లారు. సుహానా - అగస్త్య జంట అక్క‌డ‌ చాలా ప్ర‌త్యేకంగా క‌నిపించారు.

హిందీ మీడియాకి కొత్తేమీ కాదు.. నిజానికి బాలీవుడ్ మీడియా విష‌ సంస్కృతిపై చాలా విమ‌ర్శ‌లున్నాయి. ఏదైనా సినిమా విడుదలకు దగ్గర పడుతున్న క్ర‌మంలో అందులోని లీడ్ రోల్ పోషించే జంట‌ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ సాగించే ప్ర‌చారం గురించి మనం వింటూనే ఉంటాం. కొద్ది రోజుల క్రితం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' విడుద‌ల‌వుతున్న స‌మ‌యంలోను సహనటి పూజా హెగ్డేతో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. గతంలో కూడా చాలా సార్లు సినిమా విడుదలకు ముందు ప్రధాన తార‌ల డేటింగ్ గురించి పుకార్లు వినిపించాయి.

ఆస‌క్తిక‌రంగా డేటింగ్ వార్త‌ల‌తో పాటు బ్రేక‌ప్ వార్త‌లు అంతే స్పీడ్ గా ప్ర‌చార‌మ‌వుతుంటాయి. సినిమా విడుదలైన తర్వాత జంట‌ల‌ బ్రేకప్ గురించిన‌ వార్తలు వెలువ‌డుతుంటాయి. ఇదంతా కేవ‌లం ప్ర‌చార జిమ్మిక్కుగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. చాలా అరుదుగా మాత్ర‌మే ఆన్ లొకేష‌న్ ప్రేమికులుగా మారుతుంటార‌ని టాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ విభాగంలో ప‌ని చేసిన ఓ ప్ర‌ముఖుడు తెలిపారు. ఆన్ లొకేష‌న్ ప్రేమాయ‌ణాల‌కు ఆస్కారం త‌క్కువ‌. ఆఫ్ ద స్క్రీన్ మాత్ర‌మే ఏదైనా జ‌రిగేందుకు ఆస్కారం ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక‌ సుహానా - అగస్త్య డేటింగ్ చేస్తున్నారా లేదా ఇది కేవలం పుకారు మాత్రమేనా? అంటే ఆ ఇద్ద‌రూ మాత్రమే దీనికి స‌మాధానం చెప్పగలరు.

న‌ట‌వార‌సులు సుహానా ఖాన్ - ఖుషీ కపూర్ - అగస్త్య నందలను పెద్ద తెర‌పై చూడాల‌ని  ఖాన్- బ‌చ్చ‌న్ ఫ్యామిలీ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. వారంతా సినీ కుటుంబ నేపథ్యాల నుండి వ‌చ్చిన వారు కావ‌డంతో ది ఆర్చీస్ పై బ‌జ్ నెల‌కొంది. సుహానా... షారూఖ్ ఖాన్ కూతురు.. ఖుషీ దివంగత శ్రీదేవి కూతురు.. అగస్త్య స్టార్ కిడ్ కాకపోయినా.. అమితాబ్ బచ్చన్ మనవడు. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రిలో క్యూరియాసిటీ నెల‌కొంది.

ఆర్చీస్ అదే పేరుతో సంచ‌ల‌నం సృష్టించిన‌ కామిక్ బుక్ ఆధారంగా రూపొందిస్తున్న సినిమా. ప్ర‌స్తుతం హిందీ వెర్ష‌న్ లో జోయా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కొత్త‌ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది. ఇటీవ‌లే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి.

దుబాయ్ లో కొత్త సంవ‌త్స‌ర వేడుకు నోరా ఫతేహి ఇటీవల దుబాయ్ లో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ - కరణ్ జోహార్ లతో ఇన్ స్టా సెల్ఫీని షేర్ చేయ‌గా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందే సుహానా త‌న‌ తల్లి గౌరీ ఖాన్ తో క‌లిసి దుబాయ్ వెళ్లిన‌ప్పుడు  విమానాశ్రయంలో కనిపించారు. ఇప్పుడు పార్టీ నుండి మామ్ డాట‌ర్ కొత్త ఫోటోలను ఇతర అతిథులు ఇన్ స్టాలో షేర్ చేసారు. షారూఖ్ ఖాన్ విలాసవంతమైన బంగ్లా (అలీబాగ్ ఇల్లు) నుండి కొన్ని ఫోటోలను అభిమానుల పేజీలు కూడా తిరిగి షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి.

ఈ ఫోటోలలో సుహానా-గౌరీ ఖాన్  స‌హా త‌మ‌ స్నేహితులు కుటుంబ సభ్యులతో పోజులిచ్చారు. హౌస్ పార్టీలో తీసిన కొన్ని ఫోటోలలో గౌరీ తల్లి సవిత చిబ్బర్ కూడా కనిపించారు.  ఈ పార్టీలో గౌరీ సోదరుడు విక్రాంత్ చిబ్బర్ కుటుంబం కూడా కనిపించింది. సుహానా సాధారణ బూడిద రంగు దుస్తులు ధరించగా.. గౌరీ నీలం రంగు దుస్తులు ధ‌రించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News