60వయసు హీరో 20లోకి మారాడు. ఆ వయసులో ఏ రేంజులో ఉరకలెత్తించాడో ఈ వయసులో అంతకుమించి పరుగులెత్తించాడు. అదిరిపోయే స్టెప్పులతో కుమ్మి పారేశాడు. ఇంతకీ ఎవరీయన? ఎందుకిలా చేశాడు? అంటే ఇదిగో ఇదీ వివరం...
ప్రస్తుతం సీనియర్ హీరో అనీల్ కపూర్ (59) `ఫనే ఖాన్` అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ రీమిక్స్ పాట అలరించనుంది. నాటి రోజుల్లో తనదైన గానాలాపన, స్పెషల్ రిథమిక్ టోన్‌తో గ్రేట్ సాంగ్స్‌ని పాడిన మహమ్మద్ రఫీ ..`` బదన్ పే సితారే..`` పాటను రీమిక్స్ చేశారు. ఇందులో అనీల్ కపూర్ ఓ రేంజులో స్టెప్పులేశాడు. ఈ రీమిక్స్ మేకింగ్‌లో అతడు 20 ఏళ్ల కుర్రాడిలా సూపర్భ్ ఎక్స్‌ప్రెషన్స్ తో అదరగొట్టేశాడు. ఈ పాటలో ఐకానిక్ స్టెప్పులు కట్టిపడేశాయంటే అతిశయోక్తి కాదు. నాటి క్లాసిక్ హీరో షమ్మీ కపూర్‌ని మరోసారి గుర్తు తెచ్చాడు. అచ్చం అలానే అభినయించి దుంప తెంచేశాడు. లెజెండరీ మొహమ్మద్ రఫీకి ఈ పాట అంకితమిస్తూ నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ వీడియో క్లిప్‌ని అనీల్ కపూర్ స్వయంగా రిలీజ్ చేశారు. సోనునిగమ్ ఆలపించిన ఆ పాటను టీసిరీస్ ద్వారా రిలీజ్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేసుకోండిక.
Full View