సందట్లో సడేమియా అంటే ఇదేనేమో! ఒక్కోసారి ప్రయాణ ముహూర్తం బావుండకపోతే అన్నీ ఇబ్బందులే ఎదురవుతాయి. అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంది పూజా హెగ్డే. తనను తొలిసారి కేన్స్ 2022 ఉత్సవాల కోసం ఆహ్వానిస్తే ఆ ఆనందంలో తబ్బిబ్బయిన పూజా బ్యాగులు సర్ధుకుని మరీ బయల్దేరింది. కానీ ఈ ప్రయాణంలో అన్నీ ఇబ్బందులే తలెత్తాయి.
పూజ తన బ్యాగులు కోల్పోయింది. మేకప్ కిట్స్ ఆభరణాలు.. దుస్తులను పోగొట్టుకుంది. సరైన సమయంలో దొంగతనాలు తనని చిక్కుల్లో పడేసాయి. ఎలాంటి తప్పులు జరగకుండా కేన్స్ లో ఘనమైన అరంగేట్రం కోసం అవసరమైన అన్నిటినీ చకచకా తన బృందం ఏర్పాటు చేసిందని తన రెడ్ కార్పెట్ కార్యక్రమం ముగిసే వరకూ తాను కానీ.. తన బృందం కానీ ఏమీ తినలేదని పూజ చెప్పింది. దీనికి తోడు అదే సమయంలో తన హెయిర్ స్టైలిస్ట్ కు ఫుడ్ పాయిజనింగ్ అయింది.
అయితే పూజా బ్యాగులు ఇంతకీ ఎవరు కొట్టేశారు? అంటే ఇది విమానాశ్రయంలో మిస్టేక్ అని కూడా భావిస్తున్నారు. ఆమె బ్యాగ్ లలో ఒకటి మాత్రమే ప్రయాణంలో తనిఖీ చేసారట. మిగిలినవి భారతదేశంలో ఉన్నాయి.
పూజా తన వెంట తీసుకెళ్లిక ఏకైక ట్రావెల్ బ్యాగ్ కూడా ప్రయాణ సమయంలో కనిపించకుండా పోయింది. అదృష్టవశాత్తూ తన చేతి బ్యాగేజీలో భారతదేశం నుండి రెండు నిజమైన ఆభరణాలను తీసుకెళ్లగలిగింది. అవి మాత్రమే తనకు కొంత రిలీఫ్ నిచ్చాయి. పూజా రెడ్ కార్పెట్ పై మెరుపులు మెరిపిస్తూ ఘనమైన అరంగేట్రం చేయడంతో అంతా ఫర్వాలేదనిపించింది.
కానీ ఇదంతా జరగడం వెనక తన సిబ్బంది జాగ్రత్త సహకరించింది. చివరి నిమిషంలో అన్నీ కోల్పోయామని తెలుసుకున్న క్రమంలో పూజాలో టెన్షన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. కానీ ఆ టెన్షన్ రానివ్వకుండా అవసరమైన అన్నిటినీ ఆ క్షణంలో అరేంజ్ చేసారు.
టామ్ క్రూజ్ నటించిన 'టాప్ గన్: మావెరిక్' ప్రీమియర్ రెడ్ కార్పెట్ పై నడిచి ఫిల్మ్ ఫెస్టివల్ 75వ ఎడిషన్ లో కేన్స్ అరంగేట్రం చేసిన ఘనతను పూజా హెగ్డే సొంతం చేసుకుంది. పూజా లుక్స్ కి అద్భుత ప్రశంసలు దక్కాయి. తన తొలి ప్రదర్శన చివరి నిమిషంలో ఊహించని మలుపులు తనని ఇబ్బందుల్లో పడేసినా తిరిగి కోలుకోగలిగింది.