జపానోళ్లకు బాహుబలి నచ్చినట్లుందే

Update: 2018-03-02 17:25 GMT
బాహుబలి సిరీస్ మన దేశంలో అనితర సాధ్యమైన సంచలనమే సృష్టించింది. రెండో భాగం ఈ ట్రెండ్ ను మరీ విపరీతం చేసేసింది. జర్మనీ.. చైనాలాంటి దేశాలలో బాహుబలికి అంతగా ఆదరణ దక్కలేదు. కానీ జపాన్ లో మాత్రం ట్రెండ్ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

కొన్ని వారాల క్రితం జపాన్ లో బాహుబలి2 రిలీజ్ అయింది. మొదట్లో అంతగా డబ్బులు రాలేదు కానీ.. అక్కడ ఈ సినిమా నిలకడగానే ఆడింది. దీంతో పెద్దమొత్తంలోనే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాలోని కంటెంట్ ను కూడా జపాన్ జనాలు బాగానే మెచ్చినట్లు కనిపిస్తోంది. అక్కడి ఆడియన్స్ తాము బాహుబలి చూశామంటూ సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఇది పెద్ద విషయం కాకపోయినా.. బాహుబలి మూవీకి సంబంధించిన క్యారికేచర్స్ తో కార్టూన్ లు కూడా రూపొందించి మరీ నెట్ లో పెడుతున్నారు. అక్కడి లోకల్ పేపర్స్ లో కూడా బాహుబలి క్యారెక్టర్లతో కామిక్ స్టోరీలు  వస్తున్నాయి. జపాన్ వాసులను బాహుబలి మూవీ అంతగా మెప్పించేసింది.

ముఖ్యంగా ఏనుగు తొండంపై నుంచి పైకి బాహుబలి పైకి ఎక్కే సీన్ ని అయితే కార్టూన్ ఫార్మాట్ లోనే కాపీ చేసేస్తున్నారు. శివగామి పాత్ర కూడా వీరిని బాగానే మెప్పించింది. మొత్తానికి మన తెలుగు బాహుబలి.. ఎక్కడో సూర్యుడు ఉదయించే దేశం అని గుర్తింపు పొందిన దేశంలోని ప్రజలను మెప్పించడం విశేషమే.


Tags:    

Similar News