ట్రైలర్‌ టాక్‌: అత్యద్భుతం ఈ బాజీరావ్‌

Update: 2015-11-20 16:34 GMT
అనువణువూ అద్భుతం అనిపించేంత సినిమాలు తీస్తుంటాడు బాలీవుడ్ దిగ్గజం సంజయ్‌ లీలా భన్సాలి. తన సినిమాల్లో కంటెంట్‌ వైజ్‌ స్టోరీ పెద్ద గొప్పది కాకపోయినా.. తన స్ర్కీన్‌ ప్లే మాయాజాలంతో ఆకట్టేసుకుంటాడు. అలాగే కోట్ల రూపాయలతో ఆయన రూపొందించే సెట్టింగులు.. ఆ కాస్ట్యూమ్స్‌.. పదునైన సంభాషణలు.. వెంట్రుకలు నిక్కపొడిచేటంత సీన్లు.. వెరసి.. భన్సాలీ సినిమా అంటే ఓ కదిలే పెయిటింగ్‌ తరహాలో ఉంటాయి. ఈ దర్శకుడు ఇప్పుడు తనని తానే తిరగరాసుకుంటూ.. ''బాజీరావ్‌ మస్తానీ'' అనే సినిమా తీశాడు. ఈ ట్రైలర్‌ ను చూస్తుంటే.. మతిపోతోందంతే.

1720వ సంవత్సరంలో మరాఠ సామ్రాజ్యపు పేష్వాగా బాధ్యతలు చేపట్టాడు బాజీరావ్‌ (రణవీర్‌ సింగ్‌). అక్కడి నుండి దాదాపు 40 యుద్దాల్లో ఓటమి అనేది ఎరగకుండా గెలిచాడు. ఇతగాడికి కాశీభాయ్‌ (ప్రియాంకా చోప్రా) అనే భార్య.. మస్తానీ (దీపికా పదుకొనె) అనే ప్రియురాలు ఉన్నారు. ఇప్పుడిక బాజీరావ్‌ మస్తానీల ప్రేమ కథ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. యుద్దం సీన్లలో ఒంటినిండా కవచాలు తొడుక్కుని రణవీర్‌, దీపికలు యుద్దానికి వెళుతుంటే.. అదొక అద్భుతం. ఆ సీన్ లన్నీ ఒకెత్తయితే.. తన మొగుడు వేరే వనితతో తిరుగుతన్నాడని ప్రియాంక పడే బాధ.. అసలు పేష్వాను విడిచి ఉండలేక మస్తానీ పడే మానసిక యాతన.. మధ్యలో వీరి రొమాన్స్‌.. అబ్బో అత్యద్భుతం అంతే. ఈ మొత్తం ట్రైలర్‌ లో ప్రతీ ఫ్రేమూ ఒక పెయిటింగ్‌ లాగానే ఉంది. భన్సాలీ కళాదృష్టి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

రాజుల చరిత్ర అంటే చాలా ఇంట్రస్టింగ్‌ గా ఉంటుంది. అప్పుడెప్పుడో వచ్చిన జోదా అక్బర్‌ సినిమా తరువాత ఆ రేంజు కిక్కు తెచ్చినా సినిమా ఏదైనా ఉందా అంటే అది 'బాజీరావ్‌ మస్తానీ'యే అంటూ ట్రైలర్‌ చూసి చెప్పేయవచ్చు. భన్సాలీ డైరక్షన్‌ - మ్యూజిక్‌ - ఆర్టు వర్కు ఒకెత్తయితే.. రణవీర్‌ - ప్రియాంక - దీపికల నటన మరో ఎత్తు. ఎవరికివారు ఆడేసుకున్నారంతే. రసరమ్యమైన ఈ సుందరకావ్యం డిసెంబర్‌ 18న రిలీజ్‌ అవుతోంది.

Watch:http://erosnow.com/#!/movie/watch/1023354/bajirao-mastani/6613129/exclusive---official-trailer?ap=1
Tags:    

Similar News