టాలీవుడ్ మార్కెట్ పై హిందీ నిర్మాతలు బాగానే కన్నేశారు. గతంలో ధూమ్ - క్రిష్ లాంటి అతి కొన్ని సినిమాలు మాత్రమే తెలుగులో డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేసేవారు. తమిళ హీరోలు టాలీవుడ్ మార్కెట్ లో బాగానే పాగా వేసినా.. హిందీ సినిమాలు వరుస డబ్బింగ్ లు మాత్రం చాలా తక్కువే.
రీసెంట్ గా సల్మాన్ ఖాన్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయోకి తెలుగు వెర్షన్ ని కూడా ఒకే సారి రిలీజ్ చేశారు. ఇదే కాంబినేషన్ లో గతంలో వచ్చినంతగా కాకపోయినా.. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. సల్లూభాయ్ కి రామ్ చరణ్ వాయిస్ ఇవ్వడం ఈ మూవీకి అదనపు అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు మరో హిందీ మూవీ టాలీవుడ్ పై దాడికి సిద్ధమైంది. అదే సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన బాజీరావు మస్తానీ. చారిత్రాత్మక కథనంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రణ్ వీర్ - దీపికలు లీడ్ రోల్స్ చేస్తుండగా.. ప్రియాంక చోప్రా కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాను అందరూ బాహబులి సినిమాకు పోటీదారుగా చూస్తున్నారు. 600 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి రికార్డు లెవెల్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.
డిసెంబర్ 18న హిందీ వెర్షన్ తో పాటే తెలుగులోనూ బాజీరావు మస్తానీ రిలీజ్ అవుతోంది. పోరాట యోధుడి ప్రేమ కథ అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. ఈ మూవీ ఇలా తెలుగులో రావడానికి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణం కావడం కూడా కారణంగా చెప్పుకోవాలి. తెలుగులో టాప్ స్టార్లతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థకు.. టాలీవుడ్ మార్కెట్ సత్తా బాగానే అర్ధమైంది. ఇది క్లిక్ అయిందంటే మాత్రం.. ఇక హిందీ సినిమాల్లో చాలా వరకు తెలుగులో కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది.