విలక్షణ దర్శకుడు బాల. ఆయన చేసే ప్రతి సినిమా ఏదో ఒక రకంగా సంచలనాత్మకం అవుతుంటుంది. జీవితంలో ఒక్కసారైనా బాల దర్శకత్వంలో నటించాలనే కోరికని పెట్టుకొన్న కథానాయకులు చాలామందే ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు. ఎవరైనా సరే, వాళ్లల్లోని అసలు సిసలు నటుడిని బయటికి తీసుకురావాలంటే బాల దర్శకత్వంలో నటించి తీరాల్సిందే అంటుంటాయి సినీ పరిశ్రమ వర్గాలు. అయితే బాలతో పనిచేయాలంటే చాలా ఓపిక ఉండాలి. కొన్ని త్యాగాలకి సిద్ధం కావాలి. ఆయన ఎప్పుడు ఏ షాట్ తీస్తాడో తెలియదు. నటీనటులంతా అనుకొన్న సమయానికి సెట్ లో ఉండాల్సిందే. ఆయన సినిమాలో నటించాలంటే ఇక ఇతరత్రా సినిమాలేవీ పెట్టుకోకూడదు. ఆయన కథలోని పాత్రల గెటప్పులు కూడా అలా ఉంటాయి. శివపుత్రుడు - నేను దేవుడిని - వాడు వీడు చిత్రాలు చూస్తే తెలుస్తుంది ఆయన శైలి - ఆయన కథలెలా ఉంటాయో.
అసలిప్పుడు బాల గురించి ఎందుకు చెప్పాల్సొస్తుందంటే మన ఎన్టీఆర్ తో బాల ఓ చిత్రాన్ని తీసే ఆలోచనలో ఉన్నాడనే ప్రచారంవల్లే. కొంతకాలం క్రితం తనని కలిసిన బాలకి మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు చెప్పాడట. ఆ సమయంలోనే తన దగ్గరున్న ఓ కథ ఎన్టీఆర్ కి తగ్గట్టుగా ఉంటుందని బాలకి అనిపించిందట. ఆ మరుక్షణం నుంచే బాల ఎన్టీఆర్ ని కలిసి కథ చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. కానీ ఎన్టీఆరే తన సినిమా పనులవల్ల ఆయనకి సమయమివ్వలేదట. అసలు పక్కా మాస్ కథానాయకుడిగా, అభిమానుల అంచనాలకి తగ్గట్టుగా ఒక ఇమేజ్ తో యేడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ వెళ్లిపోయే ఎన్టీఆర్ బాల సినిమాకోసం అన్నేసి త్యాగాలు చేయగలడా? ఆయన తరహా రగ్ డ్ లుక్ లో కనిపించే సాహసం చేయగలడా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. మన ఫిల్మ్‌నగర్ జనాలు మాత్రం ముమ్మాటికీ డౌటే అంటున్నారు.