గౌతమీపుత్ర శాతకర్ణి రాసిన ఆహ్వానం!!

Update: 2016-04-21 07:00 GMT
బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 22న ఉదయం 10గంటల 27 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి రాసిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

అందరికీ పంపినవి కాకపోయినా.. తెలంగాణ - ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చిన ఆహ్వాన పత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. అచ్చమైన గ్రాంధిక తెలుగులో మొత్తం ఇన్విటేషన్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. ఈ ఆహ్వానాన్ని స్వయంగా అప్పటి రాజు గౌతమీ పుత్ర శాతకర్ణి రాసినట్లుగానే ప్రచురించారు. అమ్మణమ్మ పుత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి, వెంకటమ్మ పుత్ర కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు గారికి అంటూ ప్రారంభించి.. "మిత్రమ.. దక్షిణ పథేశ్వరుడిగా కీర్తి గడించి.. అవిశ్రాంత దండయాత్రికుడిగా జైత్రయాత్ర సాగించి" ఇలా ప్రారంభమవుతుంది బాలయ్య సెంచరీ సినిమా ఆహ్వాన పత్రిక.

ఇక చివరలో అయితే.. ఇట్లు మీ ఆగమ నిలయ మేరు నగధీర అంటూ.. బోలెడన్ని బిరుదులతో గౌతమీపుత్ర శాతకర్ణి రాజముద్రతో ఈ లెటర్ ను ముగించారు. ఏమైనా ఓ సినిమా ప్రారంభం కోసం.. ఇలా అహ్వాన పత్రిక ముద్రించడం మాత్రం తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి. ఈ ఆలోచనకే శభాష్ బాలకృష్ణ అంటున్నారు సినీ జనాలు.
Tags:    

Similar News