పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్తున్న బాలయ్య

Update: 2016-08-09 05:27 GMT
నందమూరి బాలకృష్ణ నూరవ చిత్రం గౌతమీ పుత్రా శాతకర్ణి తొలి రెండు షెడ్యూళ్ల షూటింగ్ అనుకున్న వ్యవధిలో అనుకున్న బడ్జెట్ లో పూర్తిచేశారు. ఇటువంటి చారిత్రాత్మక చిత్రాలను ఇంత ప్లానింగ్ తో షూట్ చెయ్యడం ఒక్క క్రిష్ బృందానికే చెల్లింది.

గతవారమే క్రిష్ వివాహం అయినా సందర్భంగా బాలయ్య ఒక వారం షూటింగ్ కి ప్యాక్ అప్ చెబుదామని అడగగా క్రిష్ అందుకు ఒప్పుకోలేదట. అయితే రోజంతా షూటింగ్ లో వుంటే కొత్త పెళ్ళికొడుకు అలిసిపోతాడని అనుకున్నారో ఏమిటో గానీ చిత్ర బృందం మాత్రం మంచి ఐడియాతో ముందుకొచ్చింది. సినిమాకి సంబంధించిన పనులు పూర్తిగా ఆపెయ్యకుండా ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ కి డబ్బింగ్ పనులను ప్రారంభించిందట.

ఈ వ్యవహారం అటు క్రిష్ కి ఇటు చిత్రానికి లాభదాయకంగా వుండడంతో బాలయ్య వెంటనే తన 100వ సినిమాకు డబ్బింగ్ మొదలుపెట్టేశాడు. ఈ డబ్బింగ్ ట్రైలర్, టీజర్ కట్ లకు సైతం ఉపయోగపడుతుందని అందరూ భావిస్తున్నారు.
Tags:    

Similar News