తెలుగు సినీ అభిమానులందు బాలయ్య అభిమానులు వేరు. తమ హీరో మీద వాళ్లు చూపించే అభిమానానికి హద్దులుండవు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభిమానులతో బాలయ్య కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. బాలయ్య సినిమా రిలీజ్ అంటే వాళ్లు చేసే హంగామా మామూలుగా ఉండదు. వందల బైకులతో ర్యాలీలు చేయడం.. థియేటర్ల దగ్గర పొట్టేళ్లను బలి ఇవ్వడం.. పాలాభిషేకాలు.. ఫ్యాన్సీ షో టికెట్ ను భారీ ధర పెట్టి కొనడం.. ఇలాంటివి సహజం. ‘లెజెండ్’ మూవీ ప్రొద్దుటూరులో ఏకంగా వెయ్యి రోజులు ఆడేస్తుందంటే.. అది కూడా అభిమానుల అండదండల వల్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక బాలయ్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు మరింత ఉత్సాహంగా కదులుతున్నారు. ఇ్పటికే జగన్ అనే అనంతపురం బాలయ్య అభిమాని.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ థీమ్ తో ప్రత్యేకంగా ఒక వెహికల్ డిజైన్ చేయించి.. ‘ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్’ సహకారంతో ‘సర్వ మహా సత్య పుణ్య క్షేత్ర జైత్ర యాత్ర’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు బాలయ్య అభిమానులు ఈ నెల 28న కార్తీక సోమవారం సందర్భంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం ఒక మహా కార్యం తలపెట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 1116 శివాలయాల్లో మహా రుద్రాభిషేకం చేయిస్తారట ఆ రోజు. బాలయ్య వందో సినిమా విజయవంతం కావడానికే ఈ ప్రయత్నమట. ఇలా చేయడం బాలయ్య అభిమానులకు మాత్రమే సాధ్యమేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/