ఎన్టీఆర్ తప్పు చేస్తూ బాలయ్యను నిందిస్తే ఎలా అంటున్నారు ఓ వర్గం నందమూరి అభిమానులు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సరైన సంఖ్యలో థియేటర్లు దక్కకుండా బాలయ్య వర్గం కుట్ర చేస్తోందంటూ ఎన్టీఆర్ అభిమానులు నిందలు మోపడం సరికాదని.. ఈ విషయంలో బాలయ్య ప్రమేయం ఏమీ లేదని ఆ వర్గం వాదిస్తోంది. సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ‘డిక్టేటర్’కే అత్యధిక థియేటర్లు దక్కుతున్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ముందు థియేటర్ల బుకింగ్ మొదలుపెట్టింది ‘డిక్టేటర్’ టీమే. ‘డిక్టేటర్’ విడుదలకు సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా సాగిపోయాయి.
ఇదిలా ఉంటే ‘నాన్నకు ప్రేమతో’ విడుదల వ్యవహారం ముందు నుంచి అంతుబట్టకుండానే ఉందని.. అసలు సినిమా సంక్రాంతికి వస్తుందో రాదో తెలియకుండా ఎగ్జిబిటర్లు ఎలా థియేటర్లు కేటాయిస్తారని బాలయ్య అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందే ఐదో తారీఖున అని.. ఇంకా సెన్సార్ ఎప్పుడవుతుందో కూడా సందిగ్ధంగానే ఉందని.. ఆ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అని ఇప్పటికీ అనుమానాలున్నాయని.. ఈ నేపథ్యంలోనే థియేటర్ల సమస్య ఎదురవుతుండొచ్చు తప్ప.. అందులో బాలయ్య ప్రమేయం ఏమీ లేదని.. తప్పు ఎన్టీఆర్ వైపు పెట్టుకుని బాలయ్యను నిందించడం సరికాదని ఆ వర్గం వాదిస్తోంది.