సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, స్టార్ హీరో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పది రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. హఠాత్తుగా కృష్ణ, మహేష్ బాబు కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోవడంతో వారి ఇంట విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఈ విషయం తెలిసి చిరంజీవి నుంచి ఇండస్ట్రీకి చెందిన ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వచ్చేసి ఆయనని, మహేష్ బాబుని కుటుంబ సభ్యులను కలిసి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఆ సమయంలో కొంత మంది హైదరాబాద్ లో లేకపోవడం, తమ సినిమాల షూటింగ్ ల కోసం విదేశాల్లో వుండటంతో మహేష్ బాబుతో పాటు కృష్ణని కలవలేకపోయారు. అందులో హీరో నందమూరి బాలకృష్ణ కూడా వున్నారు. ఇందిరాదేవి మృతి చెందిన సమయంలో నందమూరి బాలకృష్ణ టర్కీలో వున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తను నటిస్తున్న 107వ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ని టర్కీలో చిత్ర బృందం పూర్తి చేసింది. దీని కారణంగా బాలకృష్ణ టర్కీలో వుండిపోయారు. మహేష్ బాబుతో పాటు కృష్ణని పలకరించి తన సంతాపాన్ని తెలియజేయడానికి వీలుపడలేదు. అయితే శనివారం ఇందిరాదేవి చనిపోయి 11 రోజులు అవుతున్న నేపథ్యంలో 11 రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ, మహేష్ లకు అత్యంత సన్నిహితంగా వుండే ఇండస్ట్రీ వర్గాలని పిలిచినట్టుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ శనివారం 11వ రోజు కార్యక్రమంలో పాల్గొని సూపర్ స్టార్ కృష్ణని, మహేష్ తో పాటు కుటుంబ సభ్యులని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇందుకు సంబఃధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టిట వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా మహేష్ తో మాట్లాడుతున్న బాలకృష్ణ ఫొగటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి రంజిత్ ఫిలింస్ అధినేత కె. దామోదర ప్రసాద్ తో పాటు మరి కొంత మంది ఇండస్ట్రీ వర్గాలు హాజరయినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా వుంటే సోమవారం నుంచి మహేష్ .. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో తదుపరి షెడ్యూల్ ని సోమవారం నుంచి మొదలు పెట్టనున్నారని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.