సెంచరీలు కొట్టే వయస్సు మాది....బౌండరీలు దాటే మనస్సు మాది....అంటూ నందమూరి నటసింహం బాలయ్య `ఆదిత్య 369` చిత్రంలో పాటపాడిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చి దాదాపు పాతికేళ్లు దాటుతున్నా బాలయ్యలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. ఇదే విషయాన్ని బాలయ్య బాబుతో పనిచేసిన కొరియోగ్రాఫర్లు, దర్శకులు, నటీనటులు చాలా సందర్భాల్లో చెప్పారు. తాజాగా, బాలయ్య బాబు అదే ఎనర్జీతో క్రికెట్ బ్యాటు పట్టుకొని బౌండరీలు బాదేశారు. యువకులతో పోటీపడి క్రికెట్ ఆడి అభిమానులను అలరించారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలయ్య బాబు ఓ క్రికెట్ టోర్నీని ప్రారంభించిన సందర్భంగా అక్కడ సందడి చేశారు.
హిందూపురంలోని స్థానిక ఎంజీఎం స్టేడియంలో బసవతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నీని ప్రారంభించిన సందర్భంగా బాలయ్య క్రికెట్ ఆడి అక్కడకు వచ్చిన వారిని అలరించారు. ఆ టోర్నీని ప్రారంభించిన బాలయ్య యువకులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని, అక్కడకు వచ్చిన అభిమానులను తన బ్యాటింగ్ తో అలరించారు. మాససిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. యువకులంతా శారీరకంగా బలంగా ఉండడానికి క్రీడలు, వ్యాయామం పట్ల మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు.