నందమూరి తారక రామారావు వారసులుగా అటు సినీ ఇండస్ట్రీలోకి ఇటు రాజకీయాల్లోకి ఆయన్ని అనుసరిస్తూ చాలామంది ఎంట్రీ ఇచ్చారు. హరికృష్ణ బాలకృష్ణ పురుందేశ్వరీ తదితరులు ప్రత్యక్ష ఎన్నికలలో కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న భువనేశ్వరి బ్రాహ్మిణి లాంటి వారు ఎన్నికల సమయంలో ప్రచారంలో కూడా పాల్గొంటుంటారు. కాగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం తారక్ 2009 ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎందుకో టీడీపీ అధిష్టానం తారక్ ని దూరం పెడుతూ వచ్చింది. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వైస్సార్సీపీతో టచ్ లో ఉంటున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో జూనియర్ నా కట్టె కాలే వరకు నేను మా తాత స్థాపించిన పార్టీ లోనే ఉంటాను అని క్లారిటీ ఇచ్చాడు. కానీ గత ఎన్నికలలో కూడా టీడీపీ తరపున ఎలాంటి ప్రచారంలో కూడా తారక్ పాల్గొనలేదు. ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని కేవలం 23 అసెంబ్లీ స్థానాలు మరియు 3 లోక్ సభ స్థానాలకు మాత్రమే పరిమితం చేసారు. అంతేకాకుండా తెలంగాణాలో కూడా టీడీపీ పూర్తిగా దెబ్బ తినింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ దారుణమైన స్థితి నుండి బయటపడేయడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఆశాకిరణంగా మారతాడని నందమూరి అభిమానులు ఆశించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయాలంటూ అభిమానుల నుండి ఎన్టీఆర్ కి విన్నపాలు వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడూ స్పందించలేదు.
కాగా తాజాగా నందమూరి బాలకృష్ణ ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. "ఎన్టీఆర్ కు సినిమా భవిష్యత్తు చాలా ఉంది. ఫుల్ టైం రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం. వృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి రమ్మని అడగలేం కదా. నేను సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటూనే సినిమాలు చేశారు. పూర్తిస్థాయి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే.. సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం" అంటూ చెప్పుకొచ్చారు. బాలయ్య తన మాటల్లో ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనేది తారక్ ఇస్తామంటూనే.. పాలిటిక్స్ సినిమాలు బ్యాలన్స్ చేయడం ఈజీ కాదని.. ఎన్టీఆర్ కి సినీ కెరీర్ చాలా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాకుండా కూతురు బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పై కూడా స్పందించాడు బాలయ్య. ''బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తుందని అనుకుంటున్నారు చాలామంది. తన ఎదురుగా రాజకీయాలు మాట్లాడితేనే నచ్చదు. కాకపోతే పరిస్థితుల బట్టి తను నిర్ణయం తీసుకుంటుందోమో చెప్పలేం. తనని బలవంతం పెట్టం. తన ముందు పాలిటిక్స్ మాట్లాడను. అల్లుళ్ళు తన ఇంటికి వచ్చినా రాజకీయాల గురించి మాత్రం పెద్దగా మాట్లాడుకోమని.. రాజకీయంగా ఏదైనా చెప్పాలనుకుంటే చెబుతారు తప్ప దానిపై పెద్దగా చర్చలు ఉండవు'' అని చెప్పుకొచ్చారు బాలయ్య. మొత్తం మీద చాలా రోజులకి బాబాయ్ బాలయ్య నోట అబ్బాయ్ ఎన్టీఆర్ పేరొచ్చిందని నందమూరి అభిమానులు సంబరపడిపోతున్నారు.