నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే.. ఈ పాత్రకు తాను ఎందుకు మొగ్గు చూపారో.. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా స్వయంగా చెప్పారు బాలకృష్ణ.
'నిజ జీవితంలో నాకు, శాతకర్ణికి చాలానే పోలికలు ఉన్నాయి. అనుకున్నది చేసేయడం మా ఇద్దరి జీవితాల్లో కనిపిస్తుంది. ఆశయం, ఆవేశం ఉన్నవాడే శాతకర్ణి. ఆశయం లేనివాడికి విలువ లేదు. ఆవేశం లేని వాడు మనిషి కాదు. ఇంకొకరికి నచ్చేలా ఉండి, నాకు నేను నచ్చకపోతే దాని వల్ల ఉపయోగం ఉండదు. ఈ విషయంలో శాతకర్ణి, నేను ఒకేలా ఆలోచిస్తాం, ఒకేలా ఉంటాం' అంటూ అసలు విషయం చెప్పారు బాలయ్య. నాన్నగారి ఆశీస్సులు, తెలుగు ప్రేక్షక దేవుళ్ల అభిమానంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని.. 43 ఏళ్లుగా సినీ కెరీర్ ని కొనసాగిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారు.
పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసిన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఊ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పిన బాలయ్య.. తెలుగువారి ఆత్మ గౌరవం చాటి చెప్పిన మహా వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి అన్నారు. అలాంటి మహనీయుడు చరిత్ర అందరూ తెలుసుకోవాలని.. ఇలాంటి సినిమాలో నటించడం తన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం అన్నారు బాలకృష్ణ.