బాలయ్య మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తున్నాడా?

Update: 2015-04-10 09:30 GMT
టాలీవుడ్‌లో డైలాగులు చెప్పడంలో నందమూరి ఫ్యామిలీకి తిరుగులేదని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ బాలయ్యది డైలాగులు చెప్పడంలో సెపరేట్‌ స్టయిల్‌. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాల్లో బాలయ్య డైలాగులు మామూలుగా పేలలేదు. ఐతే ఆ సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్టయ్యాయని ఆ తర్వాత కూడా డైలాగుల మీద మరీ ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు బాలయ్య. 'పలనాటి బ్రహ్మనాయుడు' సినిమాలో కుప్పలు తెప్పలుగా డైలాగులు రాసేశారు పరుచూరి బ్రదర్స్‌. అవసరం ఉన్నా లేకున్నా పౌరుషం, పంచ్‌ డైలాగులతో నింపేశారు. దీంతో డోస్‌ మరీ ఎక్కువైపోయింది. జనాలు తిప్పి కొట్టారు. ఐతే ఇప్పుడు లయన్‌ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ఇందులోనూ డైలాగ్‌ డోస్‌ ఎక్కువైపోయిందేమో అనిపిస్తోంది. లెజెండ్‌లో డైలాగులు పేలిన మాట వాస్తవం. ఐతే అందులో మరీ ఎక్కువ డైలాగుల్లేవు. కానీ లయన్‌ సినిమాలో లెక్కలేనన్ని పంచ్‌ డైలాగులున్నట్లు తెలుస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

ట్రైలర్‌, ఆడియో రిలీజ్‌లో బాలయ్య నోటి నుంచి జాలువారిన కొన్ని డైలాగ్స్‌...

! భగవద్గీత యుద్ధానికి ముందూ వినబడుతుంది.. మనిషి చనిపోయాక కూడా వినబడుతుంది. మరి యుద్ధానికి ముందు వింటావా? చచ్చాక వింటావా?

! నేను ఒకణ్ని కలవాలనుకుంటే వాడి పెరట్లో పెరిగే మొక్కయినా.. వాకిట్లో మొరిగే కుక్కయినా.. వాణ్ని రక్షించే వలైనా.. వాడు కనే కలైనా నా కంట్రోల్‌లోకి రావాల్సిందే

! ఒకడొచ్చి నేను పులి అంటే.. కిందా పైనా మూసుకుని కూర్చోవాలి

! ఆటను వేటగా మార్చడానికి నాకు అర సెకన్‌ చాలు.. దాని ఔట్‌పుట్‌ ఇలానే ఉంటుంది

! నేను చెయ్యి చాచినపుడే షేక్‌ హ్యాండివ్వు. చనువిచ్చాను కదా అని చంకనెక్కి కూర్చుంటే చుట్టాలు చూడ్డానికి కూడా స్కెలిటన్‌ మిగలదు

! ఈ లయన్‌ ముందు ఎవరైనా లైన్‌ దాటితే తలరాత ఆగిపోద్ది తలకాయి పేలిపోద్ది

! నాకు పుట్టుకతోనే ఆ దేవుడు ప్రతి పార్ట్‌లోనూ పవర్‌ దాచాడు. పొరబాటున నా బాడీలో ఏ పార్ట్‌నైనా టచ్‌ చేస్తే నీ బాడీ షేప్‌ మారిపోద్ది. నీ లైఫ్‌ ఎండైపోద్ది

Tags:    

Similar News